Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవలే అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం వైభవంగా గోవాలో జరిగిన విషయం తెల్సిందే. వీరు దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకుని, సహజీవనం కూడా సాగించి ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరి జీవితాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. నాగచైతన్య ఇప్పటి వరకు ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. తల్లిదండ్రులు విడిగా ఉండటంతో పాటు ఇతరత్ర కారణాల వల్ల ఒంటరి జీవితాన్ని చైతూ గడిపేందుకు ఆసక్తి చూపించేవాడు. ఇక సమంత ఇప్పటి వరకు ఎవరైనా వండి పెడితే తినడం తప్ప తను వండటం జరగలేదు. పెళ్లి తర్వాత వీరిద్దరి జీవితంలో కొత్తగా మారుతున్నాయి. సమంతతో తోడుగా చైతూ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. అలాగే సమంత ఇకపై తినడమే కాదు వండటం కూడా చేస్తానంటుంది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో వంట వచ్చా అంటూ ఒక యాంకర్ సమంతను ప్రశ్నిస్తే ఆమె సమాధానంగా తింటాను అంటూ నవ్వేసింది. చిన్నప్పటి నుండి కూడా వంటింటికి దూరంగా ఉంటూ వచ్చిన సమంత తాజాగా చైతూను వివాహం చేసుకున్న తర్వాత వంటింట్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. తన భర్త చైతన్యకు ఇష్టమైన పదార్థాలు వండి పెట్టేందుకు ఆమె వంట నేర్చుకుంటుంది. నాగచైతన్యకు ఇష్టమైన నాలుగు రకాల వంటలను ఆమె ఇప్పటికే నేర్చుకునే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది.
తన భార్య తనకోసం వంట నేర్చుకోవడం, ఆమె చేతితో వండి పెట్టడం చైతూకు సంతోషాన్ని కలిగిస్తుండొచ్చు. సెలబ్రెటీలు అన్నప్పుడు వారికి పనిమనుషులు, వంటమనుషులు అంతా ఉంటారు. సమంత ఎందుకు వంట నేర్చుకోవాలని మీరు అనుకోవచ్చు. వంట మనిషి ఎంత రుచికరంగా వండి పెట్టినా కూడా సొంత మనిషి వండి పెట్టిన దాని రుచికి సరి తూగదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కూడా ప్రేమించిన, ప్రేమిస్తున్న భార్య చేతి వంట తినడం అదృష్టం అనకుండా ఏమంటాం.