Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయ్ దేవరకొండ, షాలిని జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు ముద్దు సీన్ పోస్టర్ కారణంగా భారీ పబ్లిసిటీ దక్కింది. ఆ పోస్టర్ విమర్శల పాలు అవ్వడంతో ఆ ప్రచారం మరింత ఎక్కువ అయ్యింది. యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ పోస్టర్‌పై కాంగ్రెస్ నాయకుడు విహెచ్‌తో పాటు పలు ప్రజా సంఘాల వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై ఆ ముద్దు సీన్ పోస్టర్లను విడుదల చేయబోవడం లేదని, ఇప్పటికే ఉన్న పోస్టర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని పోలీసులకు చిత్ర దర్శకుడు రాతపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రదేశాల్లో వెంటనే ఆ పోస్టర్లను తొలగించడం కష్టం. కావున వీలైనంత వరకు ముద్దు సీన్ పోస్టర్లను తొలగిస్తామని చెప్పుకొచ్చారు. పలు సంఘాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈవిధంగా అర్జున్ రెడ్డి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దీనిపై విజయ్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. యూత్ భారీ ఫాలోయింగ్ ఉన్న అర్జున్ రెడ్డి మంచి విజయాన్ని సాధించడం ఖాయం అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో చెబుతున్నారు.
మరిన్ని వార్తలు: