పండుగ సందర్భంగా
తిరుపతి–విశాఖపట్టణం, కాచిగూడ–విశాఖ, తిరుపతి–కాచిగూడ, హైదరాబాద్–విశాఖ, సికింద్రా బాద్– దర్బం గా, హైదరాబాద్– రెక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకుతిరుపతి–విశాఖ (07487/07488) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10 కు తిరుపతికి చేరుతుంది. కాచిగూడ–విశాఖ (07016) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50కి విశాఖ చేరుతుంది.
విశాఖ–తిరుపతి(07479) స్పెషల్ ట్రైన్ : ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి– కాచిగూడ (07146) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8, 15, 22, మార్చి 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది.
హైదరాబాద్–విశాఖ(07148/07147) స్పెషల్ ట్రైన్ : ఈ నెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 కి విశాఖ చేరుతెంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లో సాయంత్రం 6.50 కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు నాంపల్లి చేరుకుంటుంది.
సికింద్రాబాద్–దర్భంగా(07007/07008) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 3, 6, 10, 13, 17, 20, 24, మార్చి 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 1.45కు దర్భంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 9, 13, 16, 20, 23, 27, మార్చి 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.10కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
హైదరాబాద్ –రెక్సాల్ (07005/07006) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 1, 8, 15, 22, మార్చి 1,8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటకు నాంపల్లిలో బయలుదేరి రెండోరోజు సాయంత్రం 5.30కు రెక్సాల్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1 తేదీల్లో తెల్లవారు జామున 1.30 కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.15 కు నాంపల్లి చేరుకుంటుంది.