Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : సప్తగిరి , కశిష్ వోహ్ర , సాయి కుమార్ , షకలక శంకర్
నిర్మాత: రవి కిరణ్
దర్శకత్వం : చరణ్ లక్కాకుల
మ్యూజిక్ : బుల్గానిన్
సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సప్తగిరి కొద్ది కాలానికే కమెడియన్‌గా మారిపోయాడు. ‘ప్రేమకథా చిత్రమ్’తో స్టార్ కమెడియన్స్ జాబితాలో సప్తగిరి చేరిపోయాడు. రెండు సంవత్సరాల పాటు తీరిక లేనంత బిజీగా సప్తగిరి కామెడీ పాత్రలు చేస్తూ దూసుకు పోయాడు. తెలుగులో కమెడియన్స్ హీరోలుగా మారడం సర్వ సాధారణం. అందరిలాగే సప్తగిరి కూడా ‘సప్తగిరిఎక్స్ప్రెస్’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ చిత్రంతో సప్తగిరి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. దాంతో హీరోగా మరిన్ని ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్న సప్తగిరి హీరోగా మరో సినిమాను చేయడం జరిగింది. బాలీవుడ్లో సక్సెస్ చిత్రాన్ని తెలుగులో ‘సప్తగిరి ఎల్ఎల్బి’గా రీమేక్ చేయడం జరిగింది.
మొదటి సినిమాకు పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం దక్కగా రెండవ చిత్రానికి మెగా హీరో రామ్ చరణ్, సుకుమార్‌లు ప్రమోట్ చేశారు. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సప్తగిరి ట్రైలర్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ట్రైలర్లో సప్తగిరి పూర్తి స్థాయి హీరోగా కనిపిస్తున్నాడు. కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్‌లో కూడా సప్తగిరి ఆకట్టుకున్నాడు. ఖచ్చితంగా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఈ వారం పలు చిత్రాలు ప్రేక్షకు ముందుకు రాబోతున్నాయి. అయినా కూడా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎల్ఎల్బి’. కామెడీతో పాటు పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా ఉంటుందని మొదటి నుండి చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. సప్తగిరిని హీరోగా ఈ చిత్రం నిలుపుతుందా లేదా మళ్లీ కామెడీ పాత్రలు చేసుకునేలా చేస్తుందా అనేది తేలిపోనుంది.