Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : సప్తగిరి , కశిష్ వోహ్ర , సాయి కుమార్ , షకలక శంకర్
నిర్మాత: రవి కిరణ్
దర్శకత్వం : చరణ్ లక్కాకుల
మ్యూజిక్ : బుల్గానిన్
సప్తగిరి LLB మూవీని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన జాలీ LLB మూవీ నుంచి రీమేక్ చేశారు. కామెడీ, ఎంటర్టైన్మెంట్స్, లాయర్స్ నిజాయితి గురించి తెలిపే స్టొరీ ఉండటం వలన జాలీ LLB మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ ఆ మూవీ ద్వార మంచి పేరు కూడా సంపాదించాడు. ఇప్పుడు అదే నమ్మకంతో నిర్మాత డాక్టర్ రవి కిరణ్ జాలీ LLB సినిమా నిర్మాణ హక్కులని దక్కించుకున్నాడు. జాలీ LLB మూవీ ఇప్పుడు తెలుగులో సప్తగిరి LLB గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జాలీ LLB మూవీ లా సప్తగిరి LLB మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందో… లేదో..? తెలుసుకోవాలంటే ఒక్కసారి రివ్యూ లోకి వెళ్ళాల్సిందే…
కథ
సప్తగిరి (సప్తగిరి) ఒక చిన్న పల్లెటూరికి చెందిన రైతుబిడ్డ. ఎల్ ఎల్ బీ చదువుకుంటాడు. సొంత ఊరులో ఎన్ని కేసులు వాదించినా విలువ ఉండట్లేదని భావిస్తాడు. సిటీకి వెళ్లి మంచి పేరు, డబ్బు తెచ్చుకుని తన మరదలు చిట్టి (కశిష్ వోరా) ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సప్తగిరి తన బావతో కలిసి హైదరాబాద్ లో ఉంటాడు. యాక్సిడెంట్‌లో కేసులో ఎంతోమంది ప్రాణాలను తీసి నిందితుడిగా ఉన్న వ్యక్తిని రక్షిస్తాడు ఒక ప్రముఖ నేర న్యాయవాది రాజ్ పాల్ (సాయి కుమార్). ఈ విషయం తెలిసిన సప్తగిరి రాజ్ పాల్ కి వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఒక పిల్ ను ఫైల్ చేయాలని నిర్ణయించుకుంటాడు సప్తగిరి. అతను కేసు నమోదుచేయటం వలన సప్తగిరికి కలిగిన ఇబ్బందులు ఏంటి.? ఆ ఇబ్బందులను సప్తగిరి ఎలా అదిగమించాడు.? అతను చేసిన యాక్సిడెంట్‌లో చనిపోయింది ఎవరు? అతను తన మిషన్లో ఎలా విజయం సాధించాడనేది ఈ కథ.
విశ్లేషణ:
దర్శకుడు చరణ్ లక్కాకుల తెలుగు ప్రేక్షకుల రుచికి అనుగుణంగా ఒరిజినల్ సినిమా స్క్రీన్ ప్లే లో కొన్ని మార్పులను చేసాడు. ఈ దర్శకుడు జాలీ LLBలో ఉన్న అన్ని మసాలా అంశాలను సప్తగిరి LLB లో లోడ్ చేసాడు. మనం తరుచు మనం పేపర్లలో రోడ్ యాక్సిడెంట్స్‌ను చూస్తుంటాం. ఆ యాక్సిడెంట్స్‌లో నిందితులకు మాత్రం శిక్ష పడటం మనం చూసుండం. ఇలాంటి సెన్సిటివ్ పాయింట్‌ను పై రూపొందినది సప్తగిరి LLB. టైటిల్ పాత్రలో సప్తగిరి నటించాడు. ముందు కామెడీతో తర్వాత సీరియస్‌గా సాగే పాత్రలో తనదైన రీతిలో సప్తగిరి ఒదిగిపోయాడు. అలాగే సెకండాఫ్‌లో రైతులకు న్యాయం చేసే విధంగా పోరాడే సన్నివేశాల్లో సప్తగిరి నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా కోర్టులో ఎమోషనల్‌గా మాట్లాడే సన్నివేశం బావుంది. సప్తగిరి LLB లో కొన్ని కామెడీ సన్నివేశాలు, పాటలు మరియు రొమాన్స్ సన్న్జివేశాలు ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులను ధియేటర్ లో కుర్చునేలా చేస్తాయి. సెకండ్ హాఫ్ లో కూడా సమానంగా రొమాన్స్, ట్విస్ట్ లు, కామెడీ పెట్టి ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కోర్ట్ లోని కామెడీ మరియు ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
నటీనటుల ప్రదర్శన:
టైటిల్ పాత్రను పోషించిన సప్తగిరి, తన పాత్రకు మంచి ప్రదర్శనలను అందించారు, సప్తగిరి నటన ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. కశిష్ వోహ్ర పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. సాయి కుమార్, కోర్టుకు జడ్జి (శివప్రసాద్), షకలక శంకర్ మరియు ప్రభాస్ శ్రీను తమ పాత్రలకు న్యాయం చేశారు. సప్తగిరి మరియు షకలక శంకర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తాయి. సప్తగిరి కశిష్ వోహ్ర రొమాన్స్ ట్రాక్ బాగుంది. గొల్లపూడి మారుతీరావు, ఎల్బీ శ్రీరాం సహా తదితరులు చక్కగా నటించారు. సప్తగిరి LLBలో మంచి సాంకేతిక విలువలు ఉన్నాయి. సప్తగిరి ఫైట్లు, పాటలు మరియు డాన్స్ బాగాచేసాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధ్బుతంగా ఉంది. దర్శకుడు కథను నడిపించిన విధానం చాల బాగుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ …
స్క్రీన్ ప్లే
హీరో నటన
దర్శకత్వం
కోర్టు సీన్
మైనస్ పాయింట్స్ …
ఫస్ట్ హాఫ్
స్లోనెరేషన్
తెలుగు బులెట్ రేటింగ్… 3.25 / 5 .