చిన్నమ్మను వదలని కేసులు

Sashikala is yet another punishment for jail officials

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళ రాజకీయాల్లో జయలలిత నీడగా తెరపైకి వచ్చి.. చివరకు అమ్మను మించిన చిన్నమ్మ అంటూ భజనపరులతో పొగిడించుకున్న శశికళ.. ఇప్పుడు బెంగళూరు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. అయితే శశి కష్టాలు ఈ ఒక్క శిక్షతో తీరవట. కొత్తగా శశి మెడకు కేసులు చుట్టుకోనున్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య సర్కారు అందుకు గ్రౌండ్ రెడీ చేసిందట.

జైల్లో శశికళ రాజభోగాలపై ఐపీఎస్ రూప ఇచ్చిన రిపోర్ట్ పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జైళ్ల శాఖలో ఎలాంటి అవినీతి జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వీడియో ఆధారాలు కూడా ఉండటంతో.. కేసును నీరుగార్చే ఛాన్స్ లేదు. పైగా దీనికి తోడు సిద్ధరామయ్యకు ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఇలాంటి సమయంలో అవినీతిని ఉపేక్షిస్తే అస్సుల కుదరదు. అందుకే శశని బుక్ చేయాలని నిర్ణయించేసుకున్నారు.

విచారణ కమిటీ పేరుతో సాగదీస్తున్నా.. ఇప్పటికే సీఎం మనసులో మాట చెప్పేశారంటున్నారు కర్ణాటక అధికారులు. జైలు అధికారులను ప్రలోభ పెట్టినందుకు శశికళకు మరో శిక్ష వేయించాలని ఆయన సూచించారట. దీంతో ఇప్పుడు రూప పెట్టిన ఎసరు ఇలా తగులుతుంది చిన్నమ్మకు. ఉన్న వసతులు పోగా.. కొత్తగా కేసు చుట్టుకుందని చిన్నమ్మ బాథపడుతోందట.

మరిన్ని వార్తలు

హర్మన్ ప్రీత్ కు ఉద్యోగం ఇవ్వలేదా

వర్మకు ఎక్సైజ్ చెక్

విశాఖ స్కామ్ ఏ తీరానికి చేరునో..?