5 లక్షల కోట్లు దోచిపెట్టిన శశికళకు వెన్నుపోటు.

sasikala family members cheated her with her property

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

భారతీయ మూలాల్లో ఆధ్యాత్మికత సహజం. ముందుచూపు ఎక్కువ. వేల ఏళ్ల నాడే భవిష్యత్ లో ఎదురయ్యే అనర్ధాలను ఊహించి చెప్పగలిగిన గొప్పదనం మన సమాజానికి, పురాణాలకు, సాహిత్యానికి వుంది. రామాయణం రాసిన వాల్మీకి ఒకప్పుడు దోపిడీదారుడని ఆ పాపంలో భాగం పంచుకోడానికి భార్య,పిల్లలు ఒప్పుకోకపోవడంతో జ్ఞానోదయం ఆయనకు జ్ఞానోదయం అయ్యిందని చెప్పుకునే కథ మన అందరికీ తెలుసు. అవినీతి కేసుల్లో జైల్లో మఙ్గజుతున్న శశికళకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురు అయ్యిందట. శశికళను జ్ఞానోదయం అవుతుందో లేదో గానీ తగిలిన వెన్నుపోటుకు ఆమె కుంగిపోతోందట.

shashikala

శశికళ ఆస్తులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐటీ,ఈడీ దాడుల్లో వెల్లడవుతున్న వాస్తవాలు చూసి అధికారుల మైండ్ బ్లాక్ అవుతోంది.నిన్నమొన్నటిదాకా ఆమె ఆస్తుల విలువ 30 వేల కోట్ల దాక ఓ అంచనా బయటకు వచ్చింది. దానికే నోరు వెళ్లబెడుతున్న జనాలకు షాక్ తగిలేలా తాజాగా ఆ ఆస్తుల విలువ 5 లక్షల కోట్లు దాకా ఉండొచ్చని తెలుస్తోంది. ఇంత సంపాదించిన శశికళ, నటరాజన్ దంపతులకు సంతానం లేదు. దీంతో ఆమె తన బంధువర్గాన్ని మొత్తం చేరదీసింది. వారి కోసం అక్రమ మార్గాల్లో దాదాపు 5 లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్నా ప్రయోజనం లేకపోయిందట. తాజాగా ఆమె ఆస్తులపై జరుగుతున్న దాడుల వెనుక కేంద్రం హస్తం ఉన్నప్పటికీ వారికి ఉప్పు అందిస్తోంది మాత్రం శశికళ బంధువులేనట. శశికళ జైలుకు వెళ్ళాక ఆస్తులు, ఇతర వ్యవహారాల్లో పెత్తనం గురించి ఆమె బంధువుల మధ్య గొడవలు వచ్చాయట. వాటిని నివారించడానికి శశికళ జైలు కు వారిని పిలిపించుకుని ఒక్కోరికి ఒక్కో పని అప్పజెప్పిందట. అయితే ఈ వ్యవహారంలో తమ కన్నా ఇతరులకు అధిక ప్రాధాన్యం దక్కిందని బాధపడుతున్న కొందరు శశికళ మీద కోపంతో రగిలిపోయారట. అదే సమయంలో కేంద్ర నిఘా సంస్థలు వీరిని తేలిగ్గా ట్రాప్ చేసి శశి ఆస్తుల గుట్టు రాబట్టాయట.

shashi-kala-family

బంధుప్రీతి తో 5 లక్షల కోట్ల ప్రజాధనం దోచుపెట్టిన శశికళకు అదే బంధు వర్గం నుంచి వెన్నుపోటు తప్పలేదు. రాజకీయ భవిష్యత్ పోవడమే కాదు ఇన్నాళ్లు అడ్డ దారిలో సంపాదించిందంతా పోయినా శశికళ పెద్దగా పాటయించుకోలేదట కానీ ఈ దాడులకు తన బంధు వర్గం సహకరించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారట. ఇలాంటి వాళ్ళ కోసమా తాను అడ్డమైన దారుల్లో డబ్బు సంపాదించింది అని తెగ ఫీల్ అయిపోతున్నారట. ఈ వెన్నుపోటు తర్వాత అయినా శశికళ ఆలోచనల్లో మార్పు వస్తుందేమో. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మార్పు వచ్చినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం , పట్టించుకునే తీరిక జనానికి లేదు.