బీజేపీ నుంచి మాజీ మంత్రిని లాగుతున్న చంద్రబాబు.

chandra babu strategies for to bring bjp former minister Mareppa in to tdp

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

2014 లో కలిసి అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ మధ్య కాపురం ఏనాడూ సజావుగా సాగింది లేదు. ప్రధాని మోడీ దగ్గర మొదలుపెట్టి బీజేపీ లోని కింది స్థాయి కార్యకర్త దాకా ఏపీ లో టీడీపీ సర్కార్ ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టినవారే. ఇక చంద్రబాబు పనితీరు మీద నెగటివ్ కామెంట్ చేసే నేతలకు బీజేపీ లో కొదవ లేదు. ఇలా బీజేపీ ఎన్ని చేసినా చంద్రబాబుకు సర్దుకుపోక తప్పనిసరి పరిస్థితి. ఎంత సర్దుకుపోయినా ఏపీ కి, టీడీపీ కి ఒరిగిందేమీ లేదు. ప్రత్యేక హోదాని కేంద్రం పక్కనబెట్టింది. ప్యాకేజ్ ని ప్రకటనకు మాత్రమే పరిమితం చేసింది. ఇప్పుడు పోలవరం కు కూడా ఇబ్బందులు తెస్తోంది. ఇక రాజకీయంగా కూడా వైసీపీ అధినేత జగన్ కి కన్నుకొడుతూ టీడీపీ ని పదేపదే అవమానాలకు గురి చేస్తోంది. ఈ వ్యవహారాలు ఏపీ లో బీజేపీ మీద వ్యతిరేకత పెంచాయి .ఇక దేశవ్యాప్తంగా కూడా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాల ప్రభావం తో దెబ్బ తింటున్న బీజేపీ కి దూరంగా జరిగితే మేలని కొన్నాళ్లుగా చంద్రబాబు మీద టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. కానీ బాబు సంయనం, సహనం కోల్పోలేదు. ఇప్పుడిప్పుడే ఆయన ధోరణిలోనూ మార్పు వస్తోంది. బీజేపీ ని వదిలించుకుని 2019 ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు ఆయన తీసుకున్న ఓ నిర్ణయం బలపరుస్తోంది.
chandra-babu-nadiu
 ఎన్నికల ఏడాదిలో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడం సహజమే. అయితే ప్రత్యర్థి వైసీపీ తో పాటు ఓ బీజేపీ నేత, మాజీ మంత్రికి టీడీపీ గాలం వేయడం ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద సంచలనం. బీజేపీ తో ఎప్పుడూ డిఫెన్సివ్ గేమ్ ఆడే బాబు ఈసారి మాత్రం ఫుల్ ఆఫెన్స్ లో పోతున్నట్టుంది.  కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి మారెప్ప ను బీజేపీ నుంచి టీడీపీ లోకి రప్పించడానికి టీడీపీ వేగంగా పావులు కదుపుతోంది. నాలుగేళ్లుగా బీజేపీ లో వున్న ఆయన్ను టీడీపీ లోకి ఆహ్వానించినట్టు అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. నేడో, రేపో ఆయన సీఎం ని కలిసే అవకాశం వుంది. మారెప్ప మంచి వాగ్ధాటి కలిగిన నేత. మంత్రిగా పని చేసిన అనుభవం వుంది. మంచి కవి కూడా. ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేపథ్యంలో మాదిగ వర్గానికి చెందిన గట్టి నేత అవసరాన్ని టీడీపీ హైకమాండ్ గుర్తించింది. అందుకు మారెప్ప ను ఎంచుకుంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారశైలి తో ఇబ్బందులు పడ్డ చంద్రబాబు ఆయనకు కౌంటర్ గా మారెప్పను రంగంలోకి దించుతున్నారు. మామూలుగా అయితే బీజేపీ జోలికి వెళ్లేందుకు బాబు ముందుకు రారు. మారెప్ప విషయంలో బాబు తీసుకున్న చొరవ చూస్తుంటే 2019 లో కమలానికి బాబు మంగళం పాడినట్టే అనిపిస్తోంది.
chandra-babu