Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Sasikala Planing strategy For Coming Out Of Jail
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. జైలు పాలైందని శశికళ చాలా బాథపడిపోతున్నారు. అందుకే ఎంపిక చేసిన పళని ముఖ్యమంత్రిగా ఉన్నా.. అక్క కొడుకు దినకరన్ పార్టీని కంట్రోల్ చేస్తున్నా.. శశికళకు మాత్రం కంటి మీద కునుకు లేదు. కింగ్ అవుదామనుకుంటే.. కింగ్ మేకర్ పాత్రకే పరిమితం చేశారనే బాథ ఆమెలో ఉంది. అందుకే కేసుల నుంచి తప్పించుకోవడానికి అతి తెలివైన వ్యూహం అనుసరిస్తున్నారు.
చెన్నై ఎగ్మూర్ న్యాయస్థానం.. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. అయితే అన్ని ప్రశ్నలకూ తెలియదు, గుర్తులేదు అని సమాధానాలిచ్చిన విచారణ అధికారుల అనుమానాలకు బలం చేకూర్చారు. ఆరితేరిన నేరస్తులే ఇలాంటి ఆన్సర్లు ఇస్తారని వాళ్లు ముందే చెప్పారు. చిన్నమ్మ అయినా అలాగే చెప్పడంతో.. శశికళ క్రిమినల్ బ్రెయిన్ ఏంటో అందరికీ తెలిసిపోయింది.
అన్నాడీఎంకే పార్టీని సర్వం సహా గుత్తాధిపత్యంతో నడపాలని ప్లాన్ చేస్తున్న శశికళ.. అందుకోసం ఎలాగైనా కేసుల నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారు. తన క్రిమినల్ బ్రెయిన్ తో పాటు లాయర్ల సలహాలు తీసుకుని.. కోర్టును కూడా కన్ఫ్యూజ్ చేసి బయటికొచ్చేయాలని వ్యూహం రచించారు. కానీ జడ్జిల ముందు ఇలాంటి కుప్పిగంతులు చెల్లుతాయా అనేది అనుమానమే.
మరిన్ని వార్తలు:
ప్రాజెక్టుల కోసం నరబలి.. ఇంకానా..?
తెలంగాణ ఆర్టీసీని అమ్మేస్తారా..?