Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరీక్షగా మారిన సదావర్తి భూముల వేలంపాట పూర్తి అయ్యింది. సుప్రీమ్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జరిగిన ఈ వేలంపాటలో సదావర్తి భూములుకి మంచి ధర పలికింది. కడప జిల్లా కి సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి బహిరంగ వేలంలో 60 .30 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చి 83 .11 ఎకరాల సత్రం భూమిని సొంతం చేసుకున్నాడు. ఉదయం 11 గంటలకి మొదలైన బహిరంగ వేలం కి అనూహ్య స్పందన లభించింది.
ఇదే సదావర్తి భూములకు కిందటేడు 22 .40 కోట్లకి ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆ కేటాయిపు అక్రమమని కోర్టు మెట్లెక్కారు. తానే స్వయంగా అంత కన్నా ఎక్కువ చెల్లించడానికి ముందుకు వచ్చారు. చెల్లించారు కూడా. అయితే ఇంకా ఎక్కువ ధర వస్తుందని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో ఇంకో సారి బహిరంగ వేలం నిర్వహించాల్సి వచ్చింది. ఈ వేలంలో అంతకుముందు వచ్చిన దానికంటే దగ్గర దగ్గర మూడు రెట్లు అధికంగా ధర వచ్చినట్టే. ఈ మధ్య కాలంలో అన్ని వ్యవహారాల్లో ఎదురు దెబ్బలు తింటున్న వైసీపీ కి సదావర్తి భూముల వేలంపాట కొంత సాంత్వన అని చెప్పుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్యే న్యాయపోరాటం వల్లే ఈ భూముల వేలానికి ఇంత ప్రచారం, ధర వచ్చిందనడంలో సందేహం లేదు.