ఇకనైనా ఈమె పరుగు పెట్టేనా?

Seerat Kapoor Gets Back to Back Movie Offers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
శర్వానంద్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కి మంచి సక్సెస్‌ సాధించిన చిత్రం ‘రన్‌ రాజా రన్‌’. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శీరత్‌ కపూర్‌కు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. సహజంగా మొదటి సినిమా సక్సెస్‌ అయితే ఆ తర్వాత వరుసగా హీరోయిన్‌కు అవకాశాలు రావాలి. కాని శీరత్‌ కపూర్‌ విషయంలో అలా జరగలేదు. ఇటీవల ఈమె రెండు సినిమాల్లో నటించింది. అందులో మొదటిది ‘రాజు గారి గది 2’ మరోటీ ‘టచ్‌ చేసి చూడు’. ఈ రెండు చిత్రాల్లో మొదటిది ‘రాజు గారి గది 2’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో శీరత్‌ బికినీతో రెచ్చి పోయింది. సెన్సార్‌ బోర్డ్‌ కట్స్‌ వేసినా కూడా ఈమె గ్లామర్‌ సినిమాలో యూత్‌ ఆడియన్స్‌కు హీట్‌ ఎక్కించడం ఖాయం అంటున్నారు.

ముందు నుండి భావిస్తున్నట్లుగానే రాజుగారి గది 2 చిత్రంలో శీరత్‌ కపూర్‌ పాత్ర చిన్నదే అయినా మంచి ప్రాముఖ్యతను కలిగి ఉంది. తనకు వచ్చిన అవకాశంను శీరత్‌ వినియోగించుకుంది. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత శీరత్‌కు ఖచ్చితంగా మంచి ఆఫర్లు వస్తాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రేక్షకులు కూడా శీరత్‌ కపూర్‌పై నమ్మకం పెంచుకుంటున్నారు. రవితేజతో నటిస్తున్న ‘టచ్‌ చేసి చూడు’ చిత్రం విడుదలై సక్సెస్‌ సాధిస్తే ఇక శీరత్‌ కపూర్‌ కెరీర్‌ పరుగులు పెట్టడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈమెకు ఇటీవల ఒక యువ స్టార్‌ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌లో మరో హీరోయిన్‌ ఎంపిక అయ్యింది. దాంతో శీరత్‌ కపూర్‌ నిరాశకు గురైంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత శీరత్‌ కపూర్‌ ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తుందని సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. మరి ఇప్పటికి అయినా శీరత్‌ కెరీర్‌ పరుగులు పెడుతుందా అనేది చూడాలి.