బిగ్‌ బాస్‌ షో ఒక దరిద్రమైన షో

Senior Actress Lakshmi Ramakrishnan Declined Bigg Boss Show offer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హిందీలో సూపర్‌ హిట్‌ అయిన ‘బిగ్‌ బాస్‌’ షోను తాజాగా తమిళం మరియు తెలుగులో కూడా తీసుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళంలో కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా ‘బిగ్‌ బాస్‌’ షో ప్రారంభం కాగా తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ఈనెల 16న ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. ఈ బిగ్‌ బాస్‌ షోలో కొందరు సెలబ్రెటీలు నటించేందుకు ఆసక్తి చూపించగా, కొందరు మాత్రం అలాంటి షోల్లో నటించమని తేల్చి చెప్పారు. తెలుగులో పలువురు స్టార్స్‌ కూడా ‘బిగ్‌ బాస్‌’ షోకు చెప్పారు. ముఖ్యంగా తమిళ బిగ్‌ బాస్‌ షోకు స్టార్స్‌ కరువయ్యారు. 

తమిళంకు చెందిన నటి, దర్శకురాలు అయిన లక్ష్మి రామకృష్ణన్‌కు బిగ్‌బాస్‌ తమిళ షోకు ఛాన్స్‌ వచ్చింది. అయితే ఆమె 10 కోట్లు ఇచ్చినా అలాంటి చెత్త షోలో చేసేది లేదు అంటూ తేల్చి చెప్పిందట. సంబంధం లేని వ్యక్తులను ఒకే చోట ఉంచి వారితో ఆడుకోవడం అనేది ఒక దరిద్రమైన షోగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి షోలను ప్రేక్షకులు బహిష్కరించాలని కూడా ఆమె సూచిస్తున్నారు. హిందీ బిగ్‌ బాస్‌ షోలో అమ్మాయిలు, అబ్బాయిల మద్య జరిగే కొన్ని అశ్లీల సంఘటనల కారణంగా ఆమె ఇలాంటి అభిప్రాయంకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే తెలుగు మరియు తమిళంలో అలాంటి అశ్లీలం లేకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇక మరో తమిళ ప్రముఖ నటుడు స్పందిస్తూ ఆ షో వల్ల కమల్‌ సినిమాలను కోల్పోవాల్సి రావచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.