రాహుల్ పై అంతర్గత తిరుగుబాటు

senior-congress-leaders-quit-party-in-rebellion-against-rahul-gandhi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ నేతలు ఫిక్సైపోయారు రాహుల్ ప్రభ పనిచేయడం లేదని. అసలు ఆయన్ను కలిసేందుకు కూడా ఎవరూ ఇష్టపడట లేదు. దీనికి తోడు విపక్ష నేతల కీలక మీటింగులకు రాహుల్ డుమ్మా కొట్టడం కూడా పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. నిన్న ఆర్జేడీ అధినేత లాలూ నిర్వహించిన ర్యాలీల వంటివి కాంగ్రెస్ చేయాల్సింది. కానీ రాహుల్ ఆ పని చేయకుండా విదేశాలు చెక్కేశారు.

కనీసం ర్యాలీకి హాజరై వెళ్లాలని సీనియర్లు చెప్పినా.. హాజరైతే మాత్రం చేసేదేముందని రాహుల్ మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు రాహుల్ కు రాజకీయాలపై ఆసక్తి ఉందా.. లేదా అన్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. అదేమంటే తాను అన్నీ నిజాలే చెబుతానని చెబుతారు. అసలు నిజాలు చెప్పి రాజకీయాలు ఎలా చేస్తారో రాహుల్ కే తెలియాలి.

స్వతంత్ర భారత చరిత్రలో నెహ్రూ లాంటి నేత ఎవరూ లేరు. కానీ ఆయన కూడా చాలాసార్లు అబద్ధాలు చెప్పారు. అయితే వాటిని లౌక్యంగా నిజాలుగా మలుచుకున్నారు. ఆ తెలివి రాహుల్ కు అసల్లేదు. ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా వెళుతున్నారు. ఇలాంటి వాళ్లు పార్టీని గెలిపించలేరని ఫిక్సైపోయిన కాంగ్రెస్ సీనియర్లు.. ప్రియాంకను దించాలని సోనియాను కోరుతున్నారు. కానీ తన కొడుకు చిన్నబుచ్చుకుంటాడని సోనియా వెనుకా ముందు ఆడుతున్నారు.

మరిన్ని వార్తలు:

లాలూ ర్యాలీలో ఆజాద్‌, మ‌మ‌త‌, అఖిలేశ్‌, శ‌ర‌ద్ యాద‌వ్‌

జ‌గ‌న్ ను డేరాబాబాతో పోల్చిన చంద్ర‌బాబు