ఒక్క సినిమాలో 48 కట్స్‌ ఏంట్ర బాబోయ్‌..!

Sensor-Board-Gives-48-Cuts-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ‘బాబూ మోషాయ్‌ బందూక్‌ బాజ్‌’ అనే చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. టీజర్‌ విడుదలతోనే ఈ సినిమాలో ఏదో ఉంటుందనే ఆసక్తిని అందరిలో కలిగించారు. ట్రైలర్‌లో దుమ్ము దుమ్ముగా రొమాన్స్‌ చూపించి సినిమాపై యూత్‌ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను పెంచడం జరిగింది. ఇక ఆ తర్వాత ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేసి యూట్యూబ్‌ను షేక్‌ చేయడం జరిగింది. దాదాపు పూర్తి బూతు వీడియో అన్నట్లుగా ఆ పాట ఉంది. హీరో, హీరోయిన్స్‌ మద్య ఉన్న శృతిమించిన శృంగార సీన్స్‌ సినిమాకు హైలైట్‌ అవుతాయని అంతా భావించారు. కాని సెన్సార్‌ బోర్డు సినిమాను విడుదల అయ్యేందుకే ఒప్పుకోవడం లేదు. ఒక వేళ పట్టుబట్టి విడుదల చేయాలంటే దాదాపు 30 నిమిషాల సీన్స్‌ను వారు కట్‌ చేస్తున్నారు.

తాజాగా సెన్సార్‌ బోర్డు ముందుకు వెళ్లిన ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఏకంగా 48 కట్స్‌ను, కొన్ని డైలాగ్స్‌కు మ్యూట్‌ను, కొన్ని సీన్స్‌లలో హీరోయిన్‌ అందాలకు బ్లర్‌ను సూచించడం జరిగిందట. సెన్సార్‌ బోర్డు వారు చెప్పినట్లుగా చూపిస్తే సినిమాలో ఏమీ కనిపించదని, నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినప్పుడు ఎందుకు ఇంతగా కట్స్‌ ఇవ్వాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్‌ బోర్డు తీరును నిరసిస్తూ రివైజ్‌ సెన్సార్‌ కమిటీ ముందుకు వెళ్లాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన అదే పరిస్థితి అని సినిమాలో శృతిమించిన శృంగార సీన్స్‌ ఉన్నాయని, అందుకే అన్ని కట్స్‌ చెప్పామని సెన్సార్‌ బోర్డు వారు చెబుతున్నారు. ఆ సినిమా కోసం హిందీ ఆడియన్స్‌ విపరీతంగా ఎదురు చూస్తున్నారు.


మరిన్ని వార్తలు:

దాన్ని వదిలేది లేదన్న కృష్ణవంశీ