ఉత్తర స్కాట్లాండ్లో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
రాత్రి 7:10 గంటలకు కైర్న్గోర్మ్స్లోని ఏవీమోర్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు శుక్రవారం, జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. “ఇద్దరు క్షతగాత్రులను రాయిగ్మోర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ముగ్గురు గాయపడిన వారికి చికిత్స అందించారు కానీ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ”అని స్కాటిష్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ (SFRS) ప్రతినిధి తెలిపారు.
స్థానిక నివేదికల ప్రకారం, క్రాష్‌లో ఐకానిక్ ఫ్లయింగ్ స్కాట్స్‌మన్ స్టీమ్ లోకోమోటివ్ మరియు స్టేషన్‌లోని రాయల్ స్కాట్స్‌మన్ క్యారేజీలు ఉన్నాయి. “ఈ సంఘటనకు కారణమేమిటో తెలుసుకోవాల్సి ఉంది, అయితే స్పష్టంగా పూర్తి విచారణ జరగాలి” అని స్కాటిష్ గ్రీన్స్ రవాణా ప్రతినిధి మార్క్ రస్కెల్ అన్నారు