హాస్యనటుడు షకలక శంకర్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం ‘శంభో శంకర’. ఈ సినిమా ద్వారా శంకర్ స్నేహితుడు ఎన్.శ్రీధర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయితే నిన్న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండి నెగిటివ్ టాక్‌ను మూట గట్టుకుంది. సినిమా అస్సలు బాగాలేదని రివ్యూలు, విమర్శకులు చెబుతున్నారు. విడుదలకు ముందు శంకర్ చెప్పిన మాటలకు, సినిమాకు అస్సలు సంబంధం లేనట్టుగా విమర్శకులు తమ రివ్యూల్లో పేర్కొన్నారు. కానీ అయితే సినిమా విడుదలకు ముందు శంకర్ మాట్లాడిన ఆ మాటలే ‘శంభో శంకర’కు హైప్‌ను తీసుకొచ్చాయని తెలుస్తోంది శంకర్ కొట్టుకున్న సెల్ఫ్ డబ్బా (‘త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లా, దిల్ రాజు ఈ సినిమా తీయమని అడిగా’ ‘వాళ్లంతా కథ బాగుంది తీద్దాం అన్నారు కానీ నన్ను హీరోగా అంటే వెనకడుగు వేశారు’) సినిమా ఓపెనింగ్స్‌కు బాగా సహకరించింది అని అర్ధం అవుతోంది. రివ్యూలు ఎలా ఉన్నా ‘శంభో శంకర’ తొలిరోజు రూ.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని. మొత్తం 585 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.2,05,18,125 వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాతలే ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ను కూడా శనివారం విడుదల చేశారు. నిజానికి హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాకు కూడా ఈ రేంజ్లో ఓపెనింగ్స్ రాలేదు. మాస్లో శంకర్‌కు ఉన్న గుర్తింపు, పవన్ కళ్యాణ్ అభిమానులకు అతనిపై ఉన్న సానుభూతి ‘శంభో శంకర’కు బాగా కలిసొచ్చాయని నిర్మాతలు చెబుతున్నా ఇదంతా నిజమా లేక పబ్లిసిటీ స్టంట్ ఆ అనేది తెలియాల్సి ఉంది.