Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన ఒకప్పటి సహచరుడు శరద్ యాదవ్ బీహార్ వ్యాప్తంగా టూర్ పెట్టుకున్నా నితీష్ కామ్ గానే ఉన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన చేసుకోవచ్చని బదులిచ్చారు. పైగా శరద్ శిష్యుడైన త్యాగితో మాట్లాడించి, జాతీయ పార్టీ సమావేశానికి యాదవ్ వస్తారని చెప్పించారు. దీంతో నితీష్ స్కెచ్చేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా బీజేపీతో పొత్తు తన వ్యక్తిగత నిర్ణయం కాదని, పార్టీ నిర్ణయమని చెబుతున్నారు నితీష్.
అయితే శరద్ యాదవ్ ను సోనియా విపక్షాల మీటింగ్ కు ఆహ్వానించడంపై మాత్రం జేడీయూ ఫైరౌతోంది. తాము ఎన్డీఏలో చేరాక.. యూపీయే అధినేత్రి తన స్థాయిని దిగజార్చుకుని ఇలా ప్రవర్తిస్తున్నారేంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. శరద్ యాదవ్ ను సమావేశానికి పిలిచి, అందరితో ఒత్తిడి తెస్తారా.. అప్పటికీ వినకపోతే సస్పెండ్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
మొత్తం మీద ఎన్డీఏతో పొత్తు తర్వాత తొలిసారి మోడీని కలిసిన నితీష్.. ఆయన డైరక్షన్ ప్రకారం శరద్ యాదవ్ తో వ్యవహరిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా శరద్ యాదవ్ ను ఒంటరి చేసి, ఒత్తిడి పెంచి చచ్చినట్లు జేడీయూలో కొనసాగేలా చేయడానికి ఇప్పటికే ప్లాన్ రెడీ అయిందని తెలుస్తోంది. మరి నితీష్ ట్రాప్ లో శరద్ పడతారా.. లేదంటే సోనియా అండతో చెలరేగిపోతారా అనేది తెలియాలంటే ఈ నెల 19న జేడీయూ జాతీయ పార్టీ మీటింగ్ వరకూ ఆగాల్సిందే.
మరిన్ని వార్తలు: