శరద్ యాదవ్ పార్టీ పెడతారా..?

Sarad-Yadav-Establishing-A-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జేడీయూలో ముసలం వచ్చింది. బీజేపీతో జత కట్టిన నితీష్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీ మాజీ చీఫ్ శరద్ యాదవ్ రోడ్డున పడ్డారు. బీహార్ వ్యాప్తంగా జన్ సంవాద్ యాత్ర షురూ చేశారు. పదకొండు కోట్ల మంది జనం తీర్పును నితీష్ అవహేళన చేశారని మండిపడ్డారు. శరద్ యాదవ్ తీరు చూస్తుంటే కొత్త పార్టీ పెట్టే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొదట్నుంచీ శరద్ కు లాలూతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకే సామాజిక వర్గం కావడం, రాజ్యసభలో సుదీర్ఘంగా ఉన్న స్నేహం కారణంగా శరద్ లాలూ అంటే బాగా ఇష్టం ప్రదర్శిస్తారు. అందుకే నితీష్ అవినీతి అని కారణం చెబుతున్నా.. ఆ ఊసే ఎత్తడం లేదు శరద్. అధికార జేడీయూ నితీష్ తో ఉందని, అసలైన జేడీయూ తనతో పాటు ప్రజల్లో ఉందని శరద్ యాదవ్ చేస్తున్న కామెంట్లు కామెడీగా అనిపిస్తున్నాయి.

శరద్ యాదవ్ సుదీర్ఘ కాలం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఆయన బలం ఏపాటిదో జన్ సంవాద్ యాత్ర చూస్తుంటే తెలిసిపోతోంది. జేడీయూలో నేతలెవరూ ఆయనతో పాటూ లేరు. ముఖ్య అనుచరులమని చెప్పుకునే వాళ్లు కూడా ముఖం చాటేశారు. ఇలాంటి దీన స్థితిలో ఉన్న శరద్ యాదవ్ తన రాజ్యసభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.

మరిన్ని వార్తలు:

అన్సారీలో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోంది