Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జేడీయూ ఒంటెద్దు పార్టీ కాదు. అక్కడ జోడెద్దులు ఉన్నాయి. ఒక ఎద్దు నితీష్ అయితే.. మరో ఎత్తు శరద్ యాదవ్. ఇద్దరి మధ్య ఇప్పటివరకూ ఎలాంటి పొరపచ్చాలు లేవు. కానీ సడెన్ గా నితీష్ మహాకూటమి నుంచి బయటకు రావడం శరద్ యాదవ్ కు మింగుడు పడలేదు. పైగా తానకు మాట మాత్రం చెప్పకుండా నితీష్ అవమానించారని ఆయన ఆవేదన చెందుతున్నారు.
నితీష్ కు తన సత్తా చాటాలని డిసైడైన శరద్ యాదవ్ తన వర్గం ఎంపీలతో బీజేపీతో నితీష్ పొత్తుకు వ్యతిరేకంగా విమర్శలు చేయిస్తున్నారు. అటు బీహార్ ఎమ్మెల్యేల్లో కూడా కొంతమందికి ఈ పొత్తు ఇష్టం లేదు. ప్రజలిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నితీష్ ఇలాంటి పని చేస్తే ఎలాగని చాలా మంది ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అందుకే పార్టీని చీల్చి.. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని రాహుల్, లాలూతో శరద్ మంతనాలు జరుపుతున్నారు.
అయితే ఈ పరిణామాలపై అప్రమత్తమైన నితీష్ వెంటనే ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీతోనే ఉండాల్సి ఉంటుందని హితోపదేశం చేశారు. పైగా ఇప్పుడు ఎక్స్ ట్రాలు చేస్తే అసలుకే ఎసరు వస్తుందని, సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదని నితీష్ కుండబద్దలు కొట్టారట. మరి అసమ్మతి వర్గం పైపై బెదిరింపులకే పరిమితం అవుతుందా.. నిజంగానే పార్టీని చీల్చుతుందా అనేది త్వరలో తేలనుంది.
మరిన్ని వార్తలు: