Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో “కొందరు నిర్మాతలు తక్కువ ఖర్చుతో సినిమా చేసి ఎక్కువ డబ్బులు చేసుకుంటున్నారు “ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి ? తనకి ఒకప్పుడు దగ్గరగా ఉన్న శరత్ మరార్ గురించే పవన్ ఈ కామెంట్స్ చేసి ఉంటారని వాళ్ళిద్దరి గురించి తెలిసిన వాళ్ళు అంటున్న మాట. పవన్ తో సుదీర్ఘ కాలం స్నేహం చేసి చివరకు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి రెండు సినిమాలు తీసిన శరత్ మరార్ ఉన్నట్టుండి పవన్ క్యాంపు నుంచి మాయం అయిపోవడానికి తలా ఓ కారణం చెబుతున్నారు. శరత్ ఆ సినిమాల వల్ల నష్టాల పాలు అయినప్పటికీ పవన్ ముక్కు పిండి తన రెమ్యునరేషన్ తీసుకున్నారని ఓ వర్గం, పవన్ ఇచ్చిన స్వేచ్ఛను శరత్ చాలా సందర్భాల్లో దుర్వినియోగం చేసాడని ఇంకో వర్గం వాదిస్తోంది.
పైకి ఎవరు ఏమి చెబుతున్నా శరత్ మరార్ వ్యవహారశైలి గురించి దగ్గరగా చూసిన మా టీవీ మాజీ ఉద్యోగి ఒకరు వివరించారు. అంతా అనుకున్నట్టు శరత్ మెత్తటి వాడు కానే కాదు అంటున్నాడు ఆ ఉద్యోగి. అప్పట్లో మా టీవీ వ్యవస్థాపక చైర్మన్ మురళీకృష్ణం రాజుని సంస్థ నుంచి పంపివేసే క్రమంలో సీఈఓ గా పని చేసిన శరత్ చాలా దూకుడుగా వ్యవహరించాడని కూడా చెప్పారు. శరత్ తెలివితేటల గురించి కూడా ఆయన ఇంకో విషయం బయటపెట్టారు. శరత్ మా టీవీ సీఈఓ గా ఉన్న రోజుల్లో న్యూస్ డెస్క్ విభాగం లో పనిచేసే ఇద్దరు సీనియర్స్ మధ్య గొడవ ఆయన దృష్టికి వెళ్ళింది. ఆ ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించకుండా వాళ్ళ దగ్గర పని నేర్చుకుంటున్న ఓ జూనియర్ ని రిపోర్టింగ్ విభాగానికి హెడ్ ని చేసేసాడు. గొడవ పడుతున్న ఇద్దరికీ బుద్ధి చెప్పాలి అనుకుంటే అదే డెస్క్ లో జూనియర్ ని ఇన్ ఛార్జ్ గా వేయొచ్చు. ఆలా కాకుండా రిపోర్టింగ్ కి ఇన్ ఛార్జ్ గా వేయడం వల్ల డెస్క్ లో గొడవ అలాగే ఉండిపోయింది. ఇక రిపోర్టింగ్ గురించి కొత్త ఇన్ ఛార్జ్ కి ఏమీ తెలియక ఆ విభాగం పని తీరు దెబ్బ తింది. ఆయన ఆ నిర్ణయం తీసుకుని దాదాపు 13 ఏళ్ళు అయ్యింది. ఇంకా అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇంకా అర్ధం కాలేదంట ఆ ఉద్యోగికి. శరత్ పని తీరుని దగ్గరగా చూసిన ఆ ఉద్యోగి ఆయన పవన్ పేరుని , స్నేహాన్ని ఇలా దుర్వినియోగం చేసి ఉంటారని డౌట్ పడుతున్నారు. అదేమీ తెలియకుండా శరత్ కోసం పవన్ తెగ బాధపడిపోతున్నట్టు సాగుతున్న ప్రచారం మీద కూడా ఆ ఉద్యోగికి అనుమానాలున్నాయి.