అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని APCC Chief వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదేనని.. తమ గోడు వినిపించాలనుకున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. వారి గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ట అని అన్నారు. అంగన్‌వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని.. వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరపాలని షర్మిల డిమాండ్ చేశారు.