Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పద్మావతిని రాజ్ పుత్ కర్ణిసేన, బీజేపీ నేతలు వ్యతిరేకిస్తుంటే… అనేక భాషలకు చెందిన నటీనటులు మాత్రం మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈతరంతో పాటు పాతతరం నటీనటులు కూడా పద్మావతికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందన్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కానీ సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా మాత్రం పార్టీ వైఖరి ప్రకారం నడుచుకోవాలనుకున్నారో లేక వ్యక్తిగత అభిప్రాయమో తెలియదు కానీ… పద్మావతికి వ్యతిరేకంగా మాట్లాడి సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి షాకిచ్చారు.
రాజ్ పుత్ కర్ణిసేన ఏర్పాటుచేసిన ఓ సన్మాన కార్యక్రమంలో శతృఘ్న సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. పద్మావతి సెన్సార్ పూర్తికాకముందే మీడియా కోసం స్క్రీనింగ్ ఏర్పాటుచేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్ పుత్ సంఘం కోసం భన్సాలీ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేయాలని కోరారు. పద్మావతిని రాజ్ పుత్ కర్ణిసేన కార్యకర్తలకు చూపిస్తానని భన్సాలీ మాట ఇచ్చారని, కానీ దాన్ని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఈ వివాదంపై ప్రధాని మోడీ, సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ మౌనం వీడాలన్నారు.