భారతదేశపు నంబర్ ఒన్ స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్ షావోమి ఇండియా నేడు తన అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ ఎంఐ10 5జిను భారతదేశంలోని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ పోర్ట్‌ఫోలియోలో రెండు నూతన ఐఒటి ఎకోసిస్టం ఉత్పత్తులతో విడుదల చేసింది. 180 ఎంపి క్వాడ్-కెమెరా సెటప్, 5జి కనెక్టివిటీ కోసం 865 చిప్‌సెట్ క్వాల్‌కాం® స్నాప్ డ్రాగన్™, 3డి కర్వ్‌డ్ అమోల్డ్ డిస్‌ప్లే, శక్తియుత 4780 ఎంఎహెచ్ బ్యాటరీ మరియు 30వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ కలిగిన ఎంఐ 10 ప్రీమియం స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని అందించడంలో ఉన్నత శిఖరాల స్థాయిని చేరుకుంది.
విస్తరిస్తున్న తన పోర్ట్‌ఫోలియో వ్యవస్థలో భాగంగా షావోమీ ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 మరియు ఎంఐ బాక్స్ 4కెను కూడా విడుదల చేసింది. ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 పూర్తి, విస్తృత స్థాయి శబ్దాన్ని, సహజంగా సమతుల్యత, శబ్ద-నాణ్యతల ఫ్రీక్వెన్వీని అందించేలా రూపొందించగా, ఎంఐ బాక్స్ 4కెను అన్ని టీవీల వినియోగదారులకూ స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించేలా డిజైన్ చేశారు.
షావోమీ ఉపాధ్యక్ష్యుడు మరియు షావోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ మాట్లాడుతూ ‘‘షావోమీలో మేము ఆవిష్కరణల్లో నూతన మైలు రాళ్లను నెలకొల్పడంలో మరియు సాంకేతికతలో యథాస్థితిని అధిగమించడంలో విశ్వాసాన్ని పెట్టుకున్నాము. ఎంఐ 10తో మేము భారతదేశంలోని వినియోగదారులకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవానికి సరికొత్త వ్యాఖ్యానాన్ని అందించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. ఈ ఉపకరణం స్మార్ట్‌ఫోన్ డిజైన్ మరియు ఇంజినీరింగ్‌లో అత్యత్తమ స్థాయిని కలిగి ఉండగా, హ్యాండ్‌హెల్డ్ ఉపకరణంలో ఎంత వరకు సాధ్యమవుతుందో, దాని హద్దులనూ ఇది అధిగమించింది. ఈ అగ్రగామి ఒఐఎస్‌తో కూడిన 108 ఎంపి క్వాడ్ కెమెరా సెటప్, యుహెచ్‌డి 8కె వీడియో రికార్డింగ్, ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన 30 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో మేము మా వినియోగదారుల కంటెంట్‌ను గతంలో ఎన్నడూ సాధ్యం కానటువంటి రీతిలో ఎంఐ 10లో సృష్టించుకోవచ్చని మేము భరోసాను కలిగి ఉన్నామని’’ పేర్కొన్నారు.
దీని గురించి మరింత వివరిస్తూ ‘‘ఎంఐ బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా తన ఫ్లాగ్‌షిప్ ఉపకరణాలతో ప్రఖ్యాతి పొందింది మరియు (ఎ) అత్యాధునిక, కటింగ్ ఎడ్జ్ సాంకేతికత మరియు (బి) ప్రీమియం డిజైన్‌తో గుర్తింపు పొందింది. ఈ ఏడాది భారతదేశంలో మా ఎంఐ అభిమానుల కోసం పలు ఎంఐ ఉపకరణాలను తీసుకు వచ్చే ఆలోచన ఉందని’’ తెలిపారు.
రూపపు ప్రచోదన
ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ ఫొటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీను తన ఒఐఎస్-తో తయారుగా ఉండే 108 ఎంపి క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో సరికొత్త వ్యాఖ్యానానికి తెరతీసింది. వినియోగదారులు అత్యంత స్పష్టమైన చిత్రాలను మన కంటికి కనిపించని డిటెయిల్స్తో 108 ఎంపి ప్రైమరీ సెన్సర్‌తో చిత్రీకరించుకోవచ్చు మరియు 13 ఎంపి అల్ర్టా-వైడ్ యాంగిల్ లెన్స్ 123° ఎఫ్ఒవి ద్వారా వారి సబ్జెక్ట్‌కు సంబంధించిన పూర్తి రూపపు అనుభవాన్ని పొందవచ్చు. ప్రత్యేకమైన మ్యాక్రో లెన్స్ వినియోగదారులకు క్లోజ్-అప్ షాట్స్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తే డెప్త్ సెన్సర్ మృదువైన బొకేను పోట్రెయిట్‌లలో సృష్టించేందుకు సహకరిస్తుంది. ఎంఐ 10 యుహెచ్‌డి 8కె వీడియో రికార్డింగ్‌ను 30 ఎఫ్‌పిఎస్‌లో మద్దతు ఇస్తుంది.
ఎంఐ 10లో రా (RAW) మరియు లాగ్ (LOG) మోడ్‌లు వారు సృష్టించే ప్రతి కంటెంట్‌పై అద్భుత నియంత్రణను ఇస్తుంది. రా మోడ్‌తో వినియోగదారులు అత్యంత కఠిన వెలుగు పరిస్థితుల్లోనూ అత్యుత్తమ చిత్రాలను క్లిక్ చేసుకోకోవచ్చు. మరో వైపు లాగ్ మోడ్ ఏ ఛాయాచిత్రానికి అయినా ఎడిటింగ్ బల్లపై వర్ణాల సంయోజనకు అవకాశం కల్పిస్తుంది. ప్రో వీడియో మోడ్ కలర్ ఫోకస్ మరియు షూట్ స్టడీ ప్రతి వినియోగదారునిలోని చిత్ర దర్శకుడిని ప్రేరేపించేలా డిజైన్ చేశారు.
పనితీరు ప్రచోదన
ఈ ఉపకరణాన్ని అత్యాధునిక ఫ్లాగ్‌షిప్ క్వాల్‌కామ్® స్నాప్‌డ్రాగన్™ 865 చిప్‌సెట్‌తో ఎయిట్ క్రియో 585 కోర్స్‌ను కలిగి ఉండి, అత్యంత దక్షత మరియు పనితీరును అందిస్తుంది. ఇది X55 మోడెమ్‌ను కలిగి ఉండడంతో మెరుపు వేగపు 5జి కనెక్టివిటీని అందిస్తుంది. ఇది 5జి మల్టిలింక్‌ను మూడు నెట్‌వర్కుల్లో ఏకకాలానికి ఒకేసారి అనుసంధానానికి అవకాశం కల్పిస్తుంది (2.4 గిగా హెడ్జ్ వై-ఫై, 5 గిగాహెడ్జ్ వై-ఫై మరియు మొబైల్ డేటా).
8జిబి ర్యామ్ (LPDDR5) మరియు 128 జిబి లేదా 256 జిబి రోమ్ (UFS 3.0)తో ఎంఐ 10 తక్షణ ప్రతిస్పందన మరియు అత్యుత్తమ మృదువుగా పనితీరు నిర్వహణ అనుభవాన్ని అందిస్తుంది. అత్యాధునిక కూలింగ్ సిస్టమ్‌తో జోడించబడిన ఎంఐ 10 లిక్విడ్ కూల్ 2.0- మెరుగుపరచిన కూలింగ్ సిస్టమ్‌ను వినియోగించుకుంటుండగా, అందులో వెడల్పైన ఆవిరి ఛాంబర్ అలానే పలు పొరల గ్రాఫైట్ మరియు గ్రాఫీన్ స్టాక్‌లు ఉండగా వేడిని బయటకు చిమ్మేలా చేసి, ఉపకరణం సుస్థిరతతో గరిష్ఠ పనితీరును అందించేందుకు అవకాశం కల్పిస్తుంది.
కళ ప్రచోదన
ఎంఐ 10 సుందరమైన డిజైన్ మరియు వైవిధ్యమయ పనితీరు నిర్వహణ పరిపూర్ణమైన సమ్మేళనం కాగా మెరిసే 16.9 సెం.మీ. (6.67) 3డి కర్వ్‌డ్ ఇ3 అమోల్డ్ ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను ట్రూ కలర్ టెక్నాలజీని కలిగి ఉండడంతో ఇది ఉన్నత ప్రమాణంలో వర్ణాలను కచ్చితత్వంతో సరికొత్తగా ఉత్పత్తి చేస్తుంది. దాని 3డి కర్వ్‌డ్ గ్లాస్ డిజైన్ మరియు రియలిస్టిక్ హ్యాప్టిక్ సిస్టమ్‌తో అనుకూలమైన ఇన్-హ్యాండ్ ఫీల్ మరియు అత్యాధునిక హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌ను 150 విభిన్న సన్నివేశాలకు అందిస్తుంది. ఈ ఉపకరణం సదృఢ కార్నింగ్® గొరిల్లా® గ్లాస్ 5ను ముందు మరియు వెనుకవైపు కలిగి ఉంది.
90 హెడ్జ్ డిస్‌ప్లే 180 హెడ్జ్ టచ్ స్యాంప్లింగ్ మరియు వ్యాపారంలో అగ్రగామి 1216 సూపర్ లీనియర్ డ్యుయల్ స్టీరియో సిస్టమ్ ఎల్‌హెచ్‌డిసి మరియు ఎటిపిఎక్స్ అడాప్టివ్ కోడెక్ సపోర్ట్ కలిగిన ఎంఐ10 సరిసాటిలేని, మమేకమయ్యే దృశ్యం, ధ్వని మరియు స్శర్శ అనుభవాన్ని అందిస్తుంది.
ఎంఐ 10, 30 వాట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన 30 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఇది 10 వాట్ల రివర్స్ వైర్‌లెస్ ఛార్జ్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా వినియోగదారులకు ప్రయాణంలో ఇతర ఉపకరణాలను కూడా ఛార్జింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అద్భుత ఛార్జింగ్ స్పీడ్‌లు మాత్రమేకాకుండా ఎంఐ 10 ఎక్కువ సామర్థ్యం కలిగిన 4780 ఎంఎహెచ్ బ్యాటరీ మరియు 30 వాట్ల ఫాస్ట్ ఛార్జర్ ఇన్-బాక్స్‌లో వస్తుంది.
ఎంఐ 10: కీలక ప్రత్యేకతలు
6.67” కర్వ్‌డ్ అమోల్డ్ డాట్ డిస్‌ప్లే ట్రూకలర్‌తో
19.5:9 కొలమానాల నిష్పత్తి 92.4% స్ర్కీన్-టు-బాడీ నిష్పత్తి 90 Hz రియాల్టీ ఫ్లో 1120 నిట్జ్ పీక్ బ్రైట్‌నెస్ |
|
3D గ్లాస్ ముందు అలానే వెనుక
కార్నింగ్® గొరిల్లా® గ్లాస్5 ముందు అలానే వెనుక హై బ్రైట్‌నెస్ మోడ్, డార్క్ మోడ్, రీడింగ్ మోడ్ 2.0 కలర్ కాంట్రాస్ట్ రేషియో: 5,000,000:1 (టైప్) |
|
క్వాల్‌కామ్® స్నాప్ డ్రాగన్™865
కైరోటిఎం 585 సిపియు, ఆక్టా-కోర్ సిపియు 2.84 గిగాహెడ్జ్ వరకు |
|
8జిజి+ 128 జిబి+ 256 జిబి
ఎల్‌పిడిడిఆర్5, యుఎఫ్‌ఎస్ 3.0 స్టోరేజ్ |
|
అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్
లిక్విడ్ కూల్ 2.0 వేపర్ ఛేంబర్ + 6 స్టాక్ గ్రాఫైట్ లేయర్ + గ్రాఫీన్ 10.5° C సిపియు ఉష్ణోగ్రతను తక్కువ చేస్తుంది. ** |
|
క్వాడ్ రియర్ కెమెరా
108 ఎంపి అల్ర్టా-క్లియర్ ప్రైమరీ సెన్సర్ 13 ఎంపి అల్ర్టా వైడ్-యాంగిల్ లెన్స్ 123° ఎఫ్ఓవి 2 ఎంపి మ్యాక్రో లెన్స్ 2 ఎంపి డెప్త్ సెన్సర్ 8కె 30 ఎఫ్‌పిఎస్ వీడియో రికార్డింగ్ ఎఐ 2.0 నైట్ మోడ్ 2.0, షూట్ స్టడీ వీడియో, వి లాగ్ మోడ్ |
ఇన్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా
20 ఎంపి సెన్సర్ ఎఐ బ్యూటిఫై, ఎఐ మేకప్ పోట్రెయిట్ వీడియో, స్లో మోషన్ వీడియో |
4780 ఎంఎహెచ్ (టైప్) ఉన్నత సామర్థ్యపు బ్యాటరీ
30 వాట్ వైర్డ్ మరియు 30 వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ 10 వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, ఇన్-బాక్స్ ఛార్జర్: 30 వాట్ |
|
ఎంఐయుఐ 11 ఆధారిత ఆండ్రాయిడ్ 10 | |
ట్విలైట్ గ్రే, కోరల్ గ్రీన్
162.58 x 74.80 x 8.96 208 గ్రాములు |
ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2
సంగీతం పట్ల ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు ఆడియో ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన మరియు రూపొందించిన ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 మమేకం అయ్యేలా మరియు మహోన్నత శబ్దపు అనుభవాన్ని దాని 14.2 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్‌తో అందిస్తుంది. సంపూర్ణ వైర్-రహిత సంయోజనను స్టైలిష్ మరియు ఎర్గోనామిక్స్ స్లిప్-ప్రూఫ్ డిజైన్‌లో అందిస్తుండగా, ఇది మొత్తం మీద ఆడియో అనుభవాన్ని ఉన్నతీకరిస్తుంది.
ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సలేషన్ (ENC) సామర్థ్యం ఉండగా ఇది కాల్ నాణ్యతను వృద్ధి చేస్తుంది. ఇయర్ ఫోన్స్ ఎల్‌హెచ్‌డిసి హై-డెఫినిషన్ ఆడియో ఎస్‌బిసి మరియు ఎఎసి కోడెక్స్‌కు మద్దతు ఇస్తూ, అది మౌలిక శబ్దాన్ని తిరిగి ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తుంది మరియు ఇన్‌స్ర్టుమెంట్స్‌తో పాటను సంయోజన చేసే సమయంలో అడ్డుకుంటుంది. ఈ బండిల్డ్ కేస్ ఒక ఛార్జ్‌కు సులభంగా పధ్నాలుగు గంటల ప్లే బ్యాక్‌కు మరియు నాలుగు గంటలు ఆలకించేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఎంఎ బాక్స్ 4కె
ఎంఎ బాక్స్ 4కె ఆండ్రాయిడ్ టీవీ స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్ కాగా, ఇది స్మార్ట్ టీవీ కాకపోయినా దాన్ని స్మార్ట్ టీవీగా మార్చుతుంది. ఈ ఉపకరణం సరళమైన మూడు దశల్లో సెటప్ ప్రక్రియను అనుసరిస్తుంది మరియు వినియోగదారులకు వారికి ఇష్టమైన కంటెంట్ స్ర్టీమ్‌కు అవకాశం ఇస్తుంది. ఈ ఉపకరణం 4కె అల్ట్రా హెచ్‌డి వీడియో కంటెంట్ ప్లే బ్యాక్‌ను 60 ఎఫ్‌పిఎస్‌లో అత్యంత తీక్షణత చిత్ర నాణ్యతను మరియు మృదువైన వీడియో ప్లే బ్యాక్‌ను అందిస్తుంది. దీనితో ఎంఐ బాక్స్ అత్యాధునిక హెచ్‌డిఆర్ 10 స్టాండర్డ్‌కు మద్దతు ఇస్తూ, ఇది చిత్ర నాణ్యతలో వర్ణం అలానే కాంట్రాస్ట్‌లో మెరుగైన పనితీరును అందిస్తుంది. ఇది అన్నిరకాల టీవీ స్క్రీన్‌లు-హెచ్‌డి/ ఎఫ్‌హెచ్‌డి/ యుహెచ్‌డికి స్పటికంలా స్పష్టమైన ఔట్‌పుట్ అందిస్తుంది మరియు ఉన్నత ఆడియోను డాల్బి ఆడియో మరియు డిటిఎస్ 2.0 సపోర్ట్‌తో అందించడం ద్వారా సినిమా లాంటి అనుభవాన్ని సృష్టిస్తుంది.
అత్యాధునిక ఆండ్రాయిడ్ టీవీ వర్షన్ (9.0)తో పని చేసే ఎంఐ బాక్స్ 4కె నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ మరియు గూగుల్ ప్లే స్టోర్‌లో 5000+ యాప్‌లు / గేమ్స్ ద్వారా ‘కంటెంట్ ప్రపంచానికి’ ప్రవేశాన్ని ఇస్తుంది. ఈ ఉపకరణం బిల్డ్-ఇన్ క్రోమ్ కాస్ట్‌తో అందుబాటులోకి రాగా, 4కె అల్ట్రా- హెచ్‌డిని మొబైల్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌లలో (విండోస్/ మ్యాక్ ఒఎస్) అందిస్తుంది. ఎంఐ బాక్స్ 4కె గూగుల్ అసిస్టెంట్‌తో లభించే వాయిస్ సెర్చ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
ఎంఐ బాక్స్ 4కె మొదటి ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత స్ట్రీమింగ్ బాక్స్ కాగా, గూగుల్ డేటా సేవర్‌ను ముఖ్యంగా భారతదేశం కోసమే నిర్మించారు. డేటా సేవర్ మూడు రెట్లు ఎక్కువ కంటెంట్ స్ట్రీమింగ్‌కు అవకాశం కల్పించగా ప్రత్యేక యాప్‌లకు డేటా కౌంటర్, స్థానికంగా మరియు వైర్‌లెస్ తరహాలో టీవీకి ఇంటర్నెట్ అనుసంధానం అవసరం లేకుండానే ప్రసారం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఎంఐ బాక్స్ 4కె కాంప్యాక్ట్ మరియు తేలికైన డిజైన్ (148 గ్రాములు 9.52 సెం.మీ * 9.52 సెం.మీ)తో ఉంటుంది. దీనిలో 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ మరియు మాలి-450 జిపియు ఉండగా, 2జి ర్యామ్ మరియు 8బిజి ఫ్లాష్ స్టోరేజ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 2.4 గిగాహెడ్జ్ వై-ఫై బ్యాండ్లను కలిగి ఉంది మరియు ఆఫ్‌లైన్ వీడియో ప్లే బ్యాక్‌కు మద్దతు ఇస్తుంది. ఇది బ్లూటూత్ స్పీకర్లు, హెడ్‌సెట్‌లు మరియు గేమింగ్ కంట్రోలర్లకు అనుసంధానం అయ్యేందుకు బ్లూటూత్ 4.2 కలిగి ఉంది. చివరిగా ఆకట్టుకునే రీతిలో డిజైన్, గందరగోళం లేని రిమోట్ ఉండగా, ఇది గూగుల్ అసిస్టెంట్, నెట్‌ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియోకు ప్రత్యేక హాట్‌కీలను కలిగి ఉంది.
లభ్యత
- ఎంఐ 10 రెండు వర్ణాల వేరియంట్లు –ట్విలైట్ గ్రే మరియు కోరల్ గ్రీన్‌లో 8జిబి+128 జిబి, 8జిబి+256 జిబి వేరియెంట్లలో ప్రారంభిక ధర వరుసగా రూ. XXXX మరియు రూ.XXXXలలో com మరియు ఎంఐ హోమ్స్, అమెజాన్ మరియు ఆఫ్‌లైన్ రిటెయిల్ భాగస్వాముల వద్ద లభిస్తాయి. మే 8, 2020 మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ప్రీ-ఆర్డర్స్‌పై అన్ని ఛానెళ్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి మరియు కొనుగోలుదారులు ఎంఐ రూ.2.499 విలువైన 10000 వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌ను ఉచితంగా వారు డివైస్‌ను ప్రి-ఆర్డర్ చేసినప్పుడు పొందుతారు. కొనుగోలుదారులు హెచ్‌డిఎఫ్‌సి డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై రూ.3,000 రాయితీను అందుకుంటారు. నో కాస్ట్ ఇఎంఐ ఎంపికను 12 నెలల వరకు పొందవచ్చు. ఎంఐ 10 అన్ని ప్లాట్‌ఫారాలపై మే 18, 2020 నుంచి విక్రయాలకు అందుబాటులో ఉంటుంది.
- ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 com, ఎంఐ హోమ్స్, అమెజాన్.ఇన్ మరియు ఆఫ్‌లైన్ రిటెయిల్ భాగస్వాముల్లో రూ.4,499లకు మే 12, 2020 మధ్యాహ్నం 12.00 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ ఉత్పత్తి ప్రత్యేక ప్రారంభిక ధర రూ.3,999లకు మే 12 నుంచి 17 వరకు , Mi.com, ఎంఐ హోమ్స్ మరియు ఆఫ్‌లైన్ రిటెయిల్ భాగస్వాముల వద్ద లభించనుంది.
- ఎంఐ బాక్స్ 4కె మే 10, 2020 మధ్యాహ్నం 12.00కు రూ. XXXXలకు com, ఎంఐ హోమ్స్ మరియు ఫ్లిప్‌కార్ట్.కామ్‌లలో లభిస్తుంది. కొనుగోలుదారులు మా కంటెంట్ భాగస్వాములైన డాక్యుబై, షిమారో మి, ఎపిక్ ఆన్ మరియు హోయ్ చోయ్‌ల నుంచి ఆఫర్లనూ పొందవచ్చు.