వరుణ్ సందేశ్ పై విరుచుకు పడ్డ శివ జ్యోతి

వరుణ్ సందేశ్ పై విరుచుకు పడ్డ శివ జ్యోతి

బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ కోసం జరిగిన టాస్క్ భారీగా వాగ్వాదానికి దారి తీసింది. టాపర్ ఆఫ్ ది హౌస్ అనే ప్రక్రియలో ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకొన్నారు. 85వ రోజు ఎపిసోడ్‌లో రాహుల్, శ్రీముఖి, శివజ్యోతి, వరుణ్ మధ్య మాటలను గట్టిగానే విసురుకొన్నారు. ఈ సందర్భంగా టాప్ స్థానం కోసం ఇంటి సభ్యుల ప్రవర్తన, వ్యూహాలు స్పష్టంగా కనిపించాయి. ఇంతకు ఇంటిలో సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయంటే..

సోమవారం నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో అందరూ నామినేషన్ల గురించే మాట్లాడుకొన్నారు. వితిక, శివజ్యోతి ఇద్దరూ మాట్లాడుకొంటూ బాబా బాష్కర్‌ను టార్గెట్ చేశారు. అలాగే బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ మాట్లాడుకొంటూ కనిపించారు. నేను ఇంక సెల్ఫ్ నామినేట్ కావాలనుకొంటున్నాను. ఈ వారం నేను వెళ్లిపోతాను. నా మీద ఎవరికైనా ఏదైనా తప్పు అభిప్రాయం ఉంటే దానిని పొగొట్టుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాను అని చెప్పడం కనిపించింది.

ఇక సోమవారం టాస్క్‌లో టాపర్ ఆఫ్ ది హౌస్ అనే అంశాన్ని ఇచ్చారు. బిగ్‌బాస్ ఫినాలే కోసం ఇంటి సభ్యుల ఎందుకు అర్హులో రుజువు చేసుకోవాలి అంటూ నిబంధనలు పెట్టారు. ఇంటి బయట ఉన్న ర్యాంకు బోర్డులు పెట్టి..కొన్ని చీటీలు పెట్టారు. చీటిని తీస్తే వచ్చే ర్యాంకు తనకు సరికాదు అనుకొంటే.. దానిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తన ర్యాంకు వేరే వారికి వస్తే దానికి తాను ఎందుకు అర్హుడిననే విషయాన్ని చెప్పాలి.

ఇంటి సభ్యులకు వచ్చిన ర్యాంకులు చీటీల ప్రకారం బాబా భాస్కర్1కు ఒకటో నెంబర్, రాహుల్‌కు రెండో ర్యాంకు, వరుణ్ సందేశ్‌కు మూడో నంబర్, 4వ స్థానంలో అలీ రెజా, 5వ స్థానంలో శివజ్యోతి, 6వ స్థానంలో వితిక, 7 స్థానంలో శ్రీముఖి నిలిచారు. ప్రతీ ఇంటి సభ్యులు తమ క్రెడిట్స్‌ను చెప్పుకొంటూ స్థానాలను మార్చుకొనేందుకు ప్రయత్నించారు. వితిక కోసం వరుణ్ తన మూడోస్థానాన్ని ఇవ్వడం గొడవకు దారి తీసింది.

శివజ్యోతి, వరుణ్ మధ్య భారీగానే వాగ్వాదం జరిగింది. నీ భార్య అని ర్యాంకు మార్చుకోవడం సరికాదు. నా భర్త ఇప్పుడు లేడు. నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు అని శివజ్యోతి అంటే.. నీ కంటే వితిక బెటర్ అందుకే మూడోస్థానం ఇస్తాను. అలాగే నేను రాహుల్ కంటే బెటర్.. 2వ స్థానం కోసం వెళ్తాను అని వరుణ్ సందేశ్ అన్నాడు. దీనిపై భారీగా గొడవ జరిగింది.