సారీ.. రాంగ్ నంబర్..!

shivasena-made-a-wrong-atte

హిందుత్వ విస్తరణకు కంకణం కట్టుకున్న సంఘ్ పరివార్ కు పునాది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆరెస్సెస్. బీజేపీ సిద్ధాంతాలు నచ్చకపోయినా ఆరెస్సెస్ కోసం ఆ పార్టీతో చెలిమి చేస్తున్న ఏకైక పార్టీ శివసేన. బీజేపీ నేతల్ని విమర్శించడానికి ఆలోచించని శివసేన.. ఆరెస్సెస్ ను తప్పుబట్టడానికి మాత్రం కలలో కూడా ముందుకు రాదు. అందుకే బీజేపీ కంటే రెండాకులు ఎక్కువే చదివి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ను దించాలని కోరి కలకలం రేపింది.

శివసేన కామెంట్లు బీజేపీతో పాటు ప్రతిపక్షాల్లో కలవరం రేపాయి. తమ నేత గురించి తమ కంటే ముందే శివసేన ఆలోచించడమేంటని బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడ్డారు. ఇక ప్రతిపక్షాలైతే మోహన్ భగవత్ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదనే తేల్చిచెప్పాయి. అయితే ఈ ఊహాగానాల్ని ఆరెస్సెస్ చాలా తేలిగ్గా కొట్టిపడేసింది. శివసేన రాంగ్ నంబర్ కు డయల్ చేసిందని కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది.

ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి భవన్ కు వెళ్లి మరీ మోహన్ భగవత్ కలవడంతో.. ఆయనే తదుపరి రాష్ట్రపతి అని మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అయితే ప్రణబ్ పదవీ విరమణ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశానని భగవత్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకూ మోడీ, అమిత్ షా మదిలో ఏముందో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. బీజేపీ నేతల్లో రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న టెన్షన్ ఇప్పటికే పీక్స్ కు వెళ్లింది.