కోహ్లీ భార‌త్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్

shoaib akhtar praises to Virat kohli

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అంత‌ర్జాతీయ క్రికెట్లో 50 సెంచ‌రీలు పూర్తిచేసిన భార‌త్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. భార‌త మాజీ క్రికెట‌ర్లే కాకుండా దాయాది దేశానికి చెందిన మాజీలు కూడా కోహ్లీని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు. ఆధునిక క్రికెట్లో కోహ్లీ గొప్ప ఆట‌గాడ‌ని పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ప్ర‌శంసించాడు. ఛేజింగ్ లో ఇన్నింగ్స్ ను నిర్మించే విరాట్ ఆట‌తీరు అద్భుత‌మ‌ని కొనియాడాడు. ఇప్ప‌టికే 50 సెంచరీలు పూర్తిచేసిన కోహ్లీ స‌చిన్ వంద సెంచ‌రీల రికార్డును కూడా బ్రేక్ చేయ‌గ‌ల‌డ‌ని, ప్ర‌స్తుత క్రికెట్ లో ఈ ఘ‌న‌త సాధించ‌గ‌ల ఏకైక క్రికెట‌ర్ భార‌త కెప్టెనే అని షోయ‌బ్ ప్ర‌శంసించాడు.

sachin-akthar-and-kohli

స‌చిన్ తో కోహ్లీని తాను పోల్చడం లేద‌ని, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ ఆల్ టైం గ్రేట‌ని, ఇప్ప‌టి శ‌కంలో కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అని షోయ‌బ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. 44 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చేవ‌రకు క్రికెట్ ఆడ‌గ‌ల స‌త్తా కోహ్లీకుంద‌న్నాడు. త‌న అంత‌ర్జాతీయ కెరీర్ లో కోహ్లీ మొత్తం 120 వ‌ర‌కు సెంచ‌రీలు చేయ‌గ‌ల‌డ‌ని జోస్యం చెప్పాడు. అంతేకాదు… భార‌త్ పై గెలిచి పాకిస్థాన్ చాంపియ‌న్స్ ట్రోఫీ గెలుచుకున్న త‌ర్వాత కోహ్లీ ఎంత హుందాగా ప్ర‌వ‌ర్తించాడో కూడా షోయ‌బ్ వివ‌రించాడు. ఫైన‌ల్ మ్యాచ్ త‌ర్వాత విరాట్ పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వ‌చ్చి ప్ర‌తి పాక్ ఆట‌గాడిని అభినందించాడ‌ని షోయ‌బ్ తెలిపాడు.

తాను నాయ‌క‌త్వం వ‌హిస్తున్న జ‌ట్టు ఓడిపోయిన‌ప్ప‌టికీ కోహ్లీ వ‌చ్చి అలా అభినందించ‌డం త‌మ‌ను చాలా ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌న్నాడు. కోహ్లీ గొప్ప క్రికెట‌ర్ మాత్ర‌మే కాద‌ని, భార‌త్ కు గొప్ప బ్రాండ్ అంబాసిడ‌ర్ అని పాకిస్థాన్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు. షోయ‌బ్ అక్త‌రే కాదు..పాకిస్థానీలు ఎంతో మంది కోహ్లీని అభిమానిస్తారు. విరాట్ పై అంత‌ర్జాతీయంగా ఏమన్నా విమ‌ర్శ‌లు వ‌స్తే…భార‌త అభిమానుల కన్నా ముందుగా పాకిస్థానీలు త‌మ అభిమాన క్రికెట‌ర్ కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. మొత్తానికి కోహ్లీ త‌న ఆట‌తీరుతో, ప్ర‌వ‌ర్త‌న‌తో భార‌త్ లోనే కాదు…దాయ‌ది దేశంలోనూ అభిమానులను సంపాదించుకున్నాడు.