బెంగుళూరు తీవ్ర విషాదం నెలకొంది. విడాకులు పొందే సమయంలో ఉన్న ఓ భర్త అది భరించలేక తన భార్యను హత్య చేసేశాడు. అంతటితో ఆగకుండా వెంటనే విమానంలో అత్తారింటికి వెళ్లి అత్తను కూడా హత్య చేశాడు. ఆ తర్వతా తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అసలేం జరిగింది అంటే… నిందితుడు అమిత్ అగర్వాల్ బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్‌గా ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల కిత్రం అతడికి పెళ్లైంది. అతడికి పదేళ్ల వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. భార్యా బిడ్డలతో కలిసి అతడు బెంగళూరులోనే నివాసం ఉంటున్నాడు. అతడి అత్తమామాల సొంతూరు అయిన కోల్‌కతాలో ఉంటారు.
ఇదే సమయంలో కొంతకాలంగా అమిత్ దంపతుల మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విడాకులు తీసుకొనేంత వరకూ ఆ వివాదం వచ్చింది. దీంతో మొదట భార్యను చంపేశాడు. ఆ తర్వాత విమానంలో అత్తారింటికి వెళ్లి మామయ్య ముందే అత్తను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. జరిగిన దారుణం చూసి భయపడిపోయిన మామాయ్య.. ఫ్లాట్ బయటకు పారిపోయి.. బయటనుంచి గడియపెట్టేశాడు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఇరుగు పొరుగు వారి సాయం తీసుకున్నాడు. ఇదే సమయంలో అమిత్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.