పెళ్లైంది.. వరుడికి కరోనా.. షాక్ లో 70 కుటుంబాలు

marriage

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా నమోదౌతూనే ఉన్నాయి. కరోనా పరీక్షలు చేయించుకుని ఫలితం రాకముందే పెళ్లి చేసుకున్న ఓ యవకుడిని పెళ్లి అయిన వెంటనే ఐసోలేషన్ కు తరలించాల్సి వచ్చింది. వధువుతో పాటు 70 మందిని రిస్క్‌లోకి నెట్టేశాడు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే మర్రిమానుతండాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.

 అదేవిధంగా కరోనా పరీక్షల కోసం శాంపిళ్లు ఇచ్చి ఫలితం రాకముందే గ్రామానికి చేరుకొని ఈ నెల 10వ తేదీన ఎల్.తండాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసేసుకున్నాడు. అయితే అదే రోజు రాత్రి ఎల్.తండాలో ఏర్పాటు చేసిన విందులో వరుడు తీవ్ర అస్వస్థతకు గరయ్యాడు. అదే సమయంలో అతడు కరోనా బారినపడినట్లు తేలింది. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు వరుడిని ఐసోలేషన్‌కు, వధువును క్వారంటైన్‌కు తరలించారు. వివాహ వేడుకల్లో పాల్గొన్న వారు, అతనిని కలసిన వారు మొత్తం 70 కుటుంబాల వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు నిర్వహిస్తున్నారు. మొత్తానికి కోరనా సృష్టిస్తోన్న అల్లకల్లోలం సామాన్యంగా లేదు అన్నది తెలుస్తోన్న సత్యం.