జులై నెలలో బీబీనగర్ రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫారమ్ నెంబర్ 1లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన కేసు చేధించారు పోలీసులు. భువనగిరి రైల్వే పోలీసుల వివరాల ప్రకారం భూదాన్‌పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన ముద్దంగుల యాదగిరి(45) జులై 18 రాత్రి అతిగా మద్యం సేవించి కుటుంబ సభ్యులకు కనిపించకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తు రైల్వే స్టేషన్‌కు వెళ్లగా అక్కడ అపస్మారక స్థితిలో ఉన్న యాదగిరి కనిపించాడు. భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకి సంచలన విషయాలు తెలిసాయి.
మద్యం మత్తులో కూతురిపై అత్యాచారయత్నం చేయడమే కాకుండా మద్యం తాగేందుకు డబ్బుల కోసం వ్యభిచారం చేయాలని భార్యపై వత్తిడి చ్జేయడంతో యాదగిరిని అతని భార్యే హత్య చేసింది. యాదగిరిని అతని భార్య మంగ గొంతు పిసికి చంపేసింది. అయితే భర్తను హత్య చేసిన భార్య మంగ పోలీసులకు మాత్రం తప్పుడు ఫిర్యాదు ఇచ్చింది. తన భర్తను ఎవరో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు హత్య చేశారని ఫిర్యాదు చేసింది. అయితే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారణ జరిపారు.ఈ విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రిభువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయపల్లికి చెందిన ముద్దంగుల యాదగిరి(45), ముద్దంగుల మంగ భార్యభర్తలు. కూలీ పనులు చేసుకుని జీవినం సాగిస్తుంటారు.వీరికి ముగ్గురు ఆడ, ముగ్గురు మగ సంతానం. ఏడాది క్రితం వరకు హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ ప్రాంతంలో కూలీపని చేసుకుని జీవనం సాగించారు. అయితే భర్త యాదగిరి తాగుడుకు బానిసగా మారి మద్యం డబ్బుల కోసం కట్టుకున్న భార్యను బలవంతంగా వ్యభిచారం చేయమని వత్తిడి చేసేవాడు. పదేళ్ల కూతురుపై అత్యాచారం యత్నం చేయడంతో జవహర్‌నగర్ పోలీ్‌సస్టేషన్‌లో క్రైం నెం. 52/2017 అత్యాచారం యత్నించిన కేసు నమోదు చేసి జైలుకు వెళ్లివచ్చాడు.
అయితే ఆరు మాసాల క్రితం బతుకుదెరువు కోసం ఆరుగురు పిల్లలతో బీబీనగర్ ప్రాంతానికి వచ్చి రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాంపై ఆశ్రయం పొందుతున్నారు. అయితే జూలై 18వ తేదీన మృతుడు యాదగిరి మద్యం తాగి తన భార్యవద్దకు వచ్చి డబ్బుల కోసం వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో భర్త ఆగడాలు భరించే ఓపిక నశించిపోవడంతో తాగినమత్తులో ఉన్న యాదగిరి బలంగా తోసింది. కిందపడిన భర్త గొంతునులిమి చంపింది. అయితే తన భర్తను ఎవరో నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి కొట్టి చంపి పడేసి వెళ్లిపోయినట్లు కట్టుకథ చెప్పింది. దీంతో బీబీనగర్ పోలీసులు కేసు విచారణ చేసి భార్య మంగమ్మను విచారించగా భర్త ఆగడాలు భరించలేక గొంతునులిపి హత్య చేసినట్లు అంగీకరించింది.