Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాల్లో తీరిక లేకుండా ఉన్నప్పుడే పెళ్లిచేసుకోవడం, ఆ తర్వాతా కెరీర్ కొనసాగించడం నేటి హీరోయిన్ల ట్రెండ్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్ నుంచి లేటెస్ట్ గా టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ఇలాగే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పెళ్లిపీటలెక్కారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోయిన్ గా ఉన్న శృతిహాసన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్టు తెలుస్తోంది. శృతి లండన్ కు చెందిన నటుడు మైఖేల్ కోర్సెల్ తో కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది. వీరి ప్రేమపై పలుమార్లు మీడియాలో కూడా వార్తలొచ్చాయి.
అయితే ఆమె ఎప్పుడూ డైరెక్ట్ గా వాటిని అంగీకరించలేదు. తన వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం ఇష్టంలేదని మాత్రమే చెప్పడం ద్వారా మైఖేల్ తో ప్రేమ విషయాన్ని పరోక్షంగా ఒప్పుకునేది. చాలాసార్లు మైఖేల్ శృతిహాసన్ తో కలిసి ముంబై కూడా వచ్చారు. తాజాగా మైఖేల్ ను శృతి తన తల్లి, నటి సారికకు పరిచయం చేసింది. శృతిహాసన్ , సారిక, మైఖేల్ కలిసి ఉన్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. శృతి, మైఖేల్ రిలేషన్ షిప్ ను విశాల భావాలు గల ఆమె తల్లిదండ్రులు కమల్ హాసన్, సారికలిద్దరూ అంగీకరించినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో త్వరలోనే శృతి పెళ్లి కబురు వినిపించనుందని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. పెళ్లయిన ఇతర హీరోయిన్లలానే శృతిహాసన్ కూడా వివాహం తరువాతా కెరీర్ కొనసాగించనున్నట్టు సమాచారం.