పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెం ఎస్సై రాజేష్ పై మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎస్సై రాజేష్ తనను మోసం చేశాడని వరంగల్ యువతి పోలీసులకు ఫిర్యాదుచేసింది. కొన్నాళ్ల క్రితం ఆ యువతికి మాట్రిమోనీ ద్వారా ఎస్సై పరిచయమయ్యాడు. ఇద్దరూ తరచుగా ఫోన్ మాట్లాడుకున్నారు. ఒక రోజు తమ ఇంటికి వచ్చిన ఎస్సై తాను స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడని యువతి ఫిర్యాదుచేయడంతో రాజేష్ పై కేసు నమోదుచేశారు.