Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ అంటే మోదీకి అస్సలు పడటం లేదు. బహుశా ఏపీలో బీజేపీ సొంతంగా వార్డు మెంబర్ స్థానానికి కూడా పోటీ చేసే బలం లేకపోవడమో లేక తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల తదనంతర పరిస్థితుల్లో బాబు హైదరాబాద్ లో అడుగుకూడా పెట్టనివ్వక పోవడం వల్లనో అయ్యుండచ్చు. ఇక ఎటూ సరిపడా బలం లోక్ సభలో ఉంది కాబట్టి ముందు ఇస్తానన్న ప్రత్యేక హోదా హామీని కూడా అటక ఎక్కించేసారు. అయితే ఇక అడగడులే అనుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏకు మేకు అయి తన ప్రత్యర్దులనదరిని కూడా కూడబెడుతుంటే ఇక చంద్రబాబు మొహం చూడ్డానికి కూడా ఆయనిష్టపడడం లేదు. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా టీడీపీ – బీజేపీలు బద్ధ శత్రువులైపోయాయి. అయితే దేశంలో కంటే విదేశీ యాత్రల్లోనే ఎక్కువ ఉంటారు అనే పేరున్న మోదీ తాజాగా సింగపూర్ వెళ్లినప్పుడు ఆయనకు మింగుడు పడనీ మాట ఒకటి సింగపూర్ ప్రధాని నుంచి వినిపించింది.
అది అమరావతి… అవును సింగపూర్ వెళ్లిన మోదీ వద్ద అక్కడి ప్రధాని అమరావతి ప్రస్తావన తెచ్చి ఇరకాటంలో పడేశారు అక్కడి ప్రధాని లీ హసీన్ లూంగ్. వివరాల్లోకి వెళితే మోదీ తన సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రధాని లీ హసీన్ లూంగ్ – అధ్యక్షురాలు హలీమా యాకోబ్ తో సమావేశమయ్యారు. లీపై మోడీ ప్రశంసలు కురిపించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, ఆవిష్కరణలు, సాంకేతికత తదితర అంశాల గురించి మోదీ సింగపూర్ ప్రధాని లీ లూంగ్తో చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందించే విషయంపైనా మోదీ, లీ మాట్లాడుకున్నారు. లీ లూంగ్, మోదీల సమావేశం అనంతరం నిర్వహించిన సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇరువురు నేతలు మాట్లాడారు.
సింగపూర్ ప్రధాని లీ లూంగ్ మాట్లాడుతూ… ఇరు దేశాల రక్షణ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అన్నారు. లాజిస్టిక్ సహకారంపై ఇరు దేశాల నేవీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నగర ప్రస్తావన తీసుకొచ్చారు. సింగపూర్ కన్సార్టియం ఆధ్వర్యంలో అమరావతి నగర ప్రాజెక్టు పురోగతి చక్కగా ఉందని లీ పేర్కొన్నారు. సింగపూర్ ప్రధాని మాటలకు మోదీ నెత్తిన బండ పడ్డట్లు అయ్యింది. ఇప్పటికే మోడీకి ప్రత్యామ్నయం చంద్రబాబే అని తెలుగుదేశం లోని ఒక వర్గం అంటుండగా ఇపుడు మోడీ ని ఇరుకున పెట్టె మరో అంశం దొరకడంతో సోషల్ మీడియాలో మోడీని తెగ ట్రోల్ చేస్తున్నారు. సింగపూర్ వెళ్ళినా మోడీని బాబు వదలడం లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.