తెలంగాణ సంగరేణిలో ఘోరం జరిగింది. బ్లాస్ట్ మిస్ ఫైర్ కావడంతో ఒక్కసారిగా నలుగురి దుర్మరణం చెందారు. పెద్దపల్లిలోని సెంటినరీ కాలనీలో ఓపెన్ క్యాస్ట్ 1 ఫేస్ 2లో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. అయితే బ్లాస్టింగ్ సమయంలో మిస్ ఫైర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈఘటనలో ఉదయం షిఫ్టులో పనిచేస్తున్న నలుగురు ఒప్పంద కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్ళే దారిలో కన్ను మూశారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంస రోజున ఆ ఈ ఘటన జరగడంతో ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. రాష్ట్రం మొత్తం సంబరాల్లో మునిగితేలుతున్న ఈ వేళ సింగరేణి గనుల్లో భారీ పేలుడు సంభవించడం శోచనీయం. ఓపెన్ కాస్ట్-1 గనిలోని ఫేజ్-2లో బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుతుంది. అలాగే.. బ్లాస్టింగ్ కు అవసరమైన ముడిపదార్థాలు నింపుతున్న సమయంలో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి ఘటనా స్థలంలో బీభత్సం నెలకొంది. ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారి దేహాలు ఛిద్రమై పోయాయని.. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.