కరోనా వైరస్ తో చనిపోయిన సింగర్ జోయ్ డిఫ్సీ

కరోనా వైరస్ తో చనిపోయిన సింగర్ జోయ్ డిఫ్సీ

ప్రముఖ కంట్రీ సింగర్ గ్రామీ అవార్డ్ విజేత జోయ్ డిఫ్సీ కరోనా వైరస్ ధాటికి చనిపోయారు. కరోనా వైరస్ తో కొద్దిరోజులుగా పోరాడుతున్న జోయ్ ఆదివారం తుది శ్వాస విడిచాడు.మూడు రోజుల క్రితమే తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటున్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు. అంతలోనే మరణం కబళించింది. ఈ వార్త విని సంగీత ప్రియులంతా షాక్ కు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

అమెరికాలోని ఓక్లహోమాలో జన్మించిన 61 ఏళ్ల జోక్ డిఫ్సీ పాపులర్ సింగర్ గా ఎదిగారు. 1990లో పికప్ మ్యాన్ ప్రాప్ మి ఆఫ్ బిసైడ్ ది జ్యూక్ బాక్స్’ వంటి చాలా హిట్స్ సాంగ్స్ ను స్వరపరిచారు.మరో సింగర్ కూడా కరోనాతో తీవ్రంగా బాధ పడుతున్నాడు. గ్రామీ అవార్డ్ విజేత జాన్ ప్రైన్ (73) ఆరోగ్యపరిస్థితి కూడా విషమంగా ఉంది. కరోనా లక్షణాలతో జాన్ గత వారం ఆస్పత్రిలో చేరాడు. శనివారం వెంటీలేటర్ పై ఆయన చికిత్స పొందుతున్నాడు. జాన్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.