నిన్న చిత్తూరు జిల్లాలోని కలికిరి పట్టణంలో అక్కా చెల్లెలు కలిసి ఉరి వేసుకున్న ఘటనలో చిక్కుముడి వీడింది. పోలీసుల వివరాల ప్రకారం తాను ప్రేమించిన యువకుడు నో చెప్పడంతో ఇద్దరిలో పెద్దమె మనస్తాపానికి లోనయింది. చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే తాను లేకుండా చెల్లెలు బతకలేదని భావించిన యువతి తన ప్రేమ విఫలమయిన విషయాన్ని చెల్లికి చెప్పింది. అనంతరం ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కలికిరి పట్టణానికి చెందిన అక్కాచెల్లెళ్లు తస్లీమ్, షికాబీ ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతున్నారు. గత కొంత కాలంగా తస్లీమ్ ఓ యువకుడిని ప్రేమిస్తోంది.
అయితే అతను ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి లోనైంది. ఈ విషయాన్ని ఆమె చెల్లి షికాబీకి చెప్పింది. దీంతో ఇద్దరు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బ్రతుకుదెరువు కోసం కువైట్ కు వెళ్లిన తండ్రి అజంతుల్లా కుమార్తెల అంత్యక్రియలకు రాలేకపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఇటీవలే కువైట్ కు వెళ్లడంతో తిరిగిరావడం వీలుకాలేదని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, విచారణ జరుపుతున్నామని కలికిరి ఎస్సై శ్రీనివాసులు పేర్కొన్నారు.