మల్టీటాలెంటెడ్ గర్ల్ చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార . ముఖ్యంగా సోషల్ మీడియాలో సీతూపాప యమ యాక్టివ్. చిన్నప్పటి నుంచి సీతార సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటుంది. ఆమెకి ఫాలోయర్స్ కుడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇన్ స్టా లో నిత్యం సందడి చేస్తుంటుంది. ఫ్యామిలీతో కలిసి వెళ్లిన వెకేషన్ ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. అప్పుడప్పుడు చిన్నారులకు ఉపయోగపడే టిప్స్ చెబుతుంటుంది. ఇప్పుడే సితారకు 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు సితారకి యూట్యూబ్‌లో సొంతంగా ఓ ఛానల్ కూడా ఉంది.
కొద్ది రోజులుగా అనీ మాస్టర్ వద్ద డాన్స్ నెర్చుకుంటుది. ఈ క్రమంలోనే సితార టాలీవుడ్, బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్‌కు డాన్స్ చేసి ఆ వీడియో లని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. క్షణాల్లో వైరలవుతున్నాయి. తాజాగా సాయి పల్లవి పాటకు అద్భుతంగా డాన్స్ చేసింది. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అయిన సారంగదరియా పాటకు అందంగా స్టెప్పులేసింది సితార. లంగావోణిలో సాయి పల్లవిని మరిపిస్తూ డాన్స్ చేసింది. ప్రస్తుతంఈ వీడియొ సోషల్ మీడియాలోవైరల్ గా మారింది సోషల్ మీడియాలో ఈ వీడియో ని చుసిన నెటిజన్స్ ప్రిన్సెస్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సితార డాన్స్ వీడియోకు నమ్రత శిరోద్కర్ స్పందిస్తూ హార్ట్ ఎమోజీని షేర్ చేశారు.