పవన్ తో ఆ స్టార్ ని కలుపుతున్న టీవీ 9 ?

sivaji will join in pawan kalyan janasena party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆ పత్రికలు, టీవీలు టీడీపీ కి భజన చేస్తాయంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పే లిస్ట్ లో టీవీ 9 ముందుంటుంది. అలాంటి టీవీ 9 బాణీ ఈ మధ్య మారిపోయింది. సీఎం చంద్రబాబు కర్నూల్ జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యల్ని టీవీ 9 ఏ స్థాయిలో ఉతికి ఆరేసిందో చూసాం. అయితే ఇదేదో కాకతాళీయంగా జరిగిన వ్యవహారం కాదని ఆ పిమ్మట పరిణామాలతో అర్ధం అవుతూనే వుంది. టీడీపీ ని పక్కనబెట్టి జనసేనకు అండగా వుండాలని టీవీ 9 భావిస్తున్నట్టు వుంది. అందుకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నట్టు మీడియా సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న మాట.

సినిమా రంగంలో ఓ స్థాయి హీరోగా రాణించి ఫేడ్ అవుట్ అయ్యాక రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోడానికి నటుడు శివాజీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కిందటి ఎన్నికల ముందు మోడీని తెగపొగిడి బీజేపీ పంచన చేరిన శివాజీ ఆపై ప్రత్యేక హోదా అంశంలో ఆ పార్టీ వైఖరితో విభేదించారు. ఆ తర్వాత కొన్నాళ్ళు బీజేపీ వల్లే సీఎం చంద్రబాబు అనుకున్నవి చేయలేకపోతున్నట్టు వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే ప్యాకేజ్ కి టీడీపీ జై కొట్టిందో అందరినీ ఒకే గాటన కట్టేసి మాట్లాడారు శివాజీ. ప్రత్యేక హోదా ఉద్యమంలో చురుగ్గా ఉండటానికి ట్రై చేసిన శివాజీ ఆ టైం లో ఎన్నోసార్లు పవన్ కేంద్రం మీద పోరాడకుండా మౌనంగా ఉండటాన్ని తప్పుబట్టారు.

ఇటు పవన్ తో ఈ ఏడాది గా, అటు శివాజీ తో ఎన్నో ఏళ్లుగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు టీవీ 9 రవి ప్రకాష్. ఇప్పుడు తన ఇద్దరి మిత్రుల్ని కలపడానికి రవిప్రకాష్ చేసిన ప్రయత్నం ఫలించినట్టు తెలుస్తోంది. త్వరలో ఓ మంచి ముహూర్తం చూసుకుని శివాజీ జనసేనలో చేరొచ్చట. ఫోన్ లోనే ఇందుకు సంబంధించి పవన్, శివాజీ మధ్య మాటమంతీ పూర్తి అయ్యిందట. శివాజీని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ ఆయన్ని నరసరావుపేట లేదా గుంటూరు నుంచి ఎంపీ గా పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్నివార్తలు 

పవన్‌ తీరేం అర్థం కావడం లేదు!

క్రైమ్ కన్నా సెక్స్ ఎక్కువైంది.

పవన్ కి భక్తి పెరిగిందా ?