Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జీడి మార్కెట్ కు కేంద్రమైన పలాసలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. మచ్చలేని నేతగా దశాబ్దాలుగా రాజకీయాలు నెరిపిన గౌతు శ్యాం సుందర్ శివాజీ మలిదశలో మాత్రం విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీలో నమ్మకంగా కొనసాగుతున్న శివాజీ.. ఇప్పుడు కూతురు శిరీష కోసం మాత్రం దేనికైనా రెడీ అంటున్నారు.
గ్రూపులు కట్టడం, వర్గపోరుకు దిగడం, అధిష్ఠానంపై అలగడం ఇవన్నీ శివాజీకి అలవాటులేని పనులు. శ్రీకాకుళంలో సీనియర్ అయినా, తనకు మంత్రి పదవి దక్కలేదని లోలోపలే బాథపడ్డారు కానీ.. ఏనాడు నోరు తెరిచి అధిష్ఠానాన్ని పల్లెత్తు మాటనలేదు. కానీ కూతురు శిరీషకు టికెట్ దక్కకపోతే మాత్రం ఊరుకునేది లేదంటున్నారు శివాజీ.
అనారోగ్యంతో బాథపడుతున్న శివాజీ.. వచ్చే ఎన్నికల్లో శిరీషను రంగంలోకి దించడానికి సర్వం సిద్ధం చేశారు. కానీ కొందరు లోకల్ టీడీపీ లీడర్లు అడ్డం వస్తున్నారని.. వారిపై కేసులు పెట్టించి జైల్లో పెట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ దెబ్బతో శివాజీపై మచ్చ పడినట్లే అంటున్నారు ప్రత్యర్థులు.