క్వీన్స్‌టౌన్‌లో నేడు భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. క్వారంటైన్ కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటికే 0–3తో సిరీస్ కోల్పోయిన మిథాలీ సేన మిగిలిన మ్యాచ్‌లలోనైనా గెలిచి వరల్డ్ కప్‌కు ముందు కోలుకోవాలని భావిస్తోంది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్ ‘అమెజాన్ ప్రైమ్’లో ప్రసారమవుతుంది.