తానెంతగానో ప్రేమించిన యువతి, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది చేసిందని మనస్తాపానికిలోనైన ఓ సాఫ్ట్వేర్ కంపనీ ఎండీ ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన నిన్న అమీర్‌పేట్‌లో చోటు చేసుకుంది. నాచారం ప్రాంతానికి చెందిన నిఖిల్‌రెడ్డి (27) అమీర్‌పేట ధరమ్ కరమ్ రోడ్డులోని శ్రీ సాయితి టెక్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. ఇక ఆయన అదే కంపెనీలో పనిచేస్తున్న యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల నిఖిల్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె తిరస్కరించింది. దీంతో మనస్తాపానికిలోనైన అతను నిన్న తెల్లవారుజామున తన చాంబర్లో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం దీనిని గుర్తించిన సిబ్బంది ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిఖిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.