మీ టూ ఉద్యయం బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో ఉదృత రూపం దాల్చింది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను వేధించాడు అంటూ తనుశ్రీ మీ టూ ఉద్యమాన్ని ఇండియాలో వేడిగా మార్చింది. దాంతో కేవలం సినీ పరిశ్రమలో పనిచేసే వారే కాకుండా ఇతర రంగాల్లోని మహిళలు కూడా తమకు ఎదురైన లైంగిక దాడులను బయటపెడుతున్నారు. బాలీవుడ్‌లో మొదలైన మీ టూ ఇప్పుడు అన్ని భాషల్లోని సినీ పరిశ్రమలో తీవ్ర రూపం దాల్చుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ తల్లి సోని రజ్దాన్ కూడా మీ టూలో భాగంగా తనపై జరిగిన లైంగిక దాడులను బహిరంగ పర్చింది.
సినీ నటి, టీవి నటిగా మంచి పేరును సొంతం చేసుకున్న సోని రజ్దాన్ గతంలో ఓ సినిమా షూటింగ్ సందర్భంలో ఒక వ్యక్తి తనపై అత్యాచారం చేయబోయాడని చెప్పుకొచ్చింది. సదరు వ్యక్తి అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా అదృఫ్టవశాత్తు తాను చాలా తెలివిగా బయటపడ్డాను అని ఆ తర్వాత ఆ వ్యక్తి మాట్లాడడానికి ప్రయత్నించిన అతనితో అసలు మాట్లాడలేదని, ఈ విషయాన్ని బటయకు చెబితే అతని కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ఆ వ్యక్తి బుద్దిని బయట పెట్టలేదు, లైంగిక దాడులు ఎదురైతే చాలా ఓపికగా, తెలివిగా తప్పించుకోవాలి అంటూ ఈ సీనియర్ హీరోయిన్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు యువ హీరోయిన్లు మాత్రమే మీ టూ భాగంగా లైంగిక ఆరోపణలు చేశారు. సీనియర్ హీరోయిన్ స్పందంచడం ఇదే మొదటిసారి. దీంతో సీనియర్ నటీమణులు కూడా తమపై జరిగిన లైంగికదాడులను బయట పెడితే పరిస్థితి ఏంటి అనేది ఊహాతీతం అని విశ్లేషకులు భావిస్తున్నారు.