Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య తాజాగా ధనుష్ హీరోగా అమలా పాల్ హీరోయిన్గా కాజోల్ ముఖ్య పాత్రలో ‘వీఐపీ 2’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అంతా సిద్దం చేశారు. సినిమాను తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్‌లో సందడి చేశారు. ఆ సందర్బంగానే దర్శకురాలు సౌందర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగులో ఈమెకు చిరంజీవి అంటే చాలా అభిమానమట. చిరంజీవితో తన తండ్రికి చాలా సన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చింది. చిరంజీవితో సినిమా చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నాను అని, చిరంజీవితో తెలుగు మరియు తమిళంలో ఒక సినిమా చేయాలి అనేది తన కోరిక అంటూ సౌందర్య చెప్పుకొచ్చింది. ఇది ఏమాత్రం తీరని కోరికగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్లో లేడీ డైరెక్టర్స్‌కు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు. ముఖ్యంగా స్టార్ హీరోలు లేడీ డైరెక్టర్స్‌ను అస్సలు పట్టించుకోరు. అలాంటిది చిరంజీవిని డైరెక్ట్ చేయాలని కోరుకోవడం సౌందర్య అవివేకంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 151వ చిత్రం కోసం చిరంజీవి రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత 152వ చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇలా వరుసగా పది సినిమాల వరకు చిరంజీవి వెనుక క్యూ కట్టి ఉన్నారు. సౌందర్య 11వ వ్యక్తి. ఆమె వంతు వచ్చేవరకు మళ్లీ మద్యలో కొత్త దర్శకులు వస్తూనే ఉంటారు. అంటే ఆమె చిరంజీవితో సినిమా చేయడం దాదాపు అసాధ్యంగా చెప్పుకోవచ్చు.
మరిన్ని వార్తలు