నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ అలాగే మరో హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా నే “డాకు మహారాజ్”. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి ప్రమోషన్స్ కూడా మేకర్స్ చేస్తుండగా రిజల్ట్ మేకర్స్ మంచి కాన్ఫిడెన్స్ గానే ఉన్నారు.
అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ కోసం గ్రాండ్ ప్లానింగ్స్ ను చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ ప్లానింగ్స్ లో జనవరి మొదటి వారంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒక ఊహించని అతిథిని తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి దీని ప్రకారం ఆ అతిధి ఎవరో కాదు మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అట.
తారక్ తో ఈ మూవీ నిర్మాతలు నాగవంశీ, త్రివిక్రమ్ లకి మంచి అనుబంధం ఉంది. పైగా ఇది బాలయ్య మూవీ కూడా దీనితో ఉన్న హైప్ ను మరింత బూస్టప్ ఇచ్చేలా ఈ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి దీనిపై ఏమన్నా అధికారిక ప్రకటన వస్తుందో లేదో అనేది.