Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Speech By BJP Party Leader Venkayya Naidu About GST
మోడీని దైవదూత అని పొగిడినా.. విపక్షాలను అదరగొట్టి బెదరగొట్టినా.. అందుకు వెంకయ్యే కావాలి. విధానాలు, సిద్ధాంతాలను ఎప్పుడో వదిలేసిన నేటి రాజకీయాల్లో.. రాద్ధాంతాల్ని కూడా అణగదొక్కాలంటే వెంకయ్య లాంటి ప్రచారకుడు మోడీకి అవసరం. అందుకే మోడీ అండ చూసుకుని వెంకయ్య రెచ్చిపోతున్నారు. జీఎస్టీ గురించి వెంకయ్య ఇచ్చిన స్పీచ్ కు.. బీజేపీ అగ్రనేతలు కూడా ఫ్లాటైపోతున్నారు.
మోడీ, జైట్లీ కూడా జీఎస్టీతో పన్నులు తగ్గుతాయని సన్నాయి నొక్కులు నొక్కుతుంటే.. వెంకయ్య మాత్రం కుండబద్దలు కొట్టేశారు. ఆస్తి పెంచకుండా పంచితే.. పంచే మిగిలుతుందని, అందుకే అభివృద్ధి ఫలాలు అందాలంటే.. అందరూ పన్నులు కట్టాలని తేల్చిచెప్పేశారు. దీంతో జనానికి వాస్తవం బోధపడింది. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్నట్లు.. వెంకయ్య చెబితే కానీ జీఎస్టీ తత్వం ఎక్కడం లేదు జనాలకు.
ఎంతైనా సమాచార శాఖ మంత్రి కదా. ఆ మాత్రం వాక్చాతుర్యం ఉంటుంది. కానీ వెంకయ్య మరో ఆసక్తికరమైన వాదన కూడా చేశారు. సామాన్యులు వాడే 80 శాతం వస్తువులు ఐదు శాతం పన్ను పరిధిలో పెట్టామని గొప్పగా చెప్పుకున్నారు. ఇంతకూ సామాన్యుు వాడాల్సిన, వాడకూడని వస్తువులేంటో కూడా సర్కారు వారు దయతో సెలవిస్తే జనం కూడా జాగ్రత్త పడతారని సెటైర్లు వినిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు: