ఆస్ట్రేలియాతో ఐదు T-20ల సిరీస్ కోసం భారత జట్టుకు వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా వ్యవహరించనున్నారు. హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవికాలం ముగియడంతో లక్ష్మణ్ కు బీసీసీఐ ఈ బాధ్యతలు అప్పగించింది. ఇరు జట్ల మధ్య 5 టీ20లు రేపటి నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో భాగంగా రేపు విశాఖపట్నంలో ఇరుజట్లు తలపడనున్నాయి.
కాగా, ప్రపంచ కప్ ఓటమిని పూర్తిగా మర్చిపోకముందే ఆసీస్ తో టి20 సిరీస్ కు టీమిండియా రెడీ అయిపోయింది. ఈ సిరీస్ లో సీనియర్ ప్లేయర్లు అందరికీ విశ్రాంతి ఇచ్చిన టీం మేనేజ్మెంట్ కుర్రాళ్ళతో కూడిన జట్టును బరిలోకి దింపుతోంది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. వీరిలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా చోటు దక్కింది. ప్రపంచ కప్ జట్టులో ఉన్న వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ఈ సిరీస్ ఆడుతున్నారు. వాళ్లే సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ద్ కృష్ణ. హార్దిక్ పాండ్యా రీప్లేస్మెంట్ గా వరల్డ్ కప్ జట్టులోకి ప్రసిద్ద్ కృష్ణ వచ్చిన సంగతి తెలిసిందే.