ప్రపంచ కప్ లో ఇండియా అలుపెరగని పోరాటం చేసి ఫైనల్ వరకు వచ్చినా చివరకు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయింది. ఎంతో ఆశతో ఫైనల్ చేరినా ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ ను గెలవడంలో ఫెయిల్ అయింది. అయితే ఈ ఓటమికి చాలా కారణాలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నా క్రికెట్ ప్రముఖులు మాత్రం ఒక విషయాన్ని చాలా ఖచ్చితంగా చెబుతున్నారు. జట్టు కూర్పులో కొన్ని విషయాలు క్లియర్ గా చెబుతున్నారు, ముఖ్యంగా రోహిత్ శర్మ లీడ్ చేసిన సేనలో పార్ట్ టైం బౌలింగ్ చేసే వారే లేకపోవడం గమనార్హం. గతంలో చూసుకుంటే సచిన్, సెహ్వాగ్, రైనా, గంగూలీ, యువరాజ్ సింగ్.. లు అటు బ్యాట్ తో ఇటు బంతితో రాణించిన సందర్భాలు కోకొల్లలు అని చెప్పాలి.
కానీ నేడు ఉండే జట్టులో ఆ పరిస్థితి ఉందా అంటే ప్రశ్నార్ధకమే ? ఆ అయిదుగురు బౌలర్లే ఏమైనా చేయాల్సి ఉంది. అందుకే ఇకపైన ఇండియా టీం లో పార్ట్ తిమీరను సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత బీసీసీఐ పైన ఉందంటూ కొందరు సలహా ఇస్తున్నారు.