ఇంగ్లాండ్ జట్టుతో టెస్టులు ఆడుతున్న భారత్ కు… మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఉప్పల్ మ్యాచ్ లో భారత్ దారుణంగా ఓడిపోయింది. ఒకరోజు ఆట మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా భారత్ ఓడిపోయింది. అయితే ఈ ఓటమి జీర్ణించుకోక ముందే.. భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.
ఇంగ్లాండ్ జట్టుతో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కు భారత్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర దూరం కానున్నట్లు సమాచారం అందుతుంది. అతను తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. జట్టు వెంట అతను రెండో టెస్టు జరిగే విశాఖపట్నం కి వెళ్లినా… అక్కడి నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి అతని తరలిస్తారని సమాచారం అందుతుంది. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా చాలా అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.