నిన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా 31 వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. KKR మొదట బ్యాటింగ్ చేసి 6వికెట్లు నష్టపోయి 223 పరుగులు చేసింది.
అయితే ఆ లక్ష్యాన్ని రాజస్థాన్ ఎంతో కష్టపడి చేదించగలిగింది. 8వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ బ్యాటర్లలో జోష్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు. అతనికి రియాన్ పరాగ్ అలాగే పోవెల్ సహాయ సహకారాలు అందించడంతో రాజస్థాన్ విజయం సాధించగలిగింది. అటు సునీల్ నరేన్ సెంచరీ చేసినప్పటికీ కేకేఆర్ మాత్రం విజయం సాధించలేదు.