ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇటు బౌలింగ్‌లో, అటు బ్యాటింగ్‌లో అదరగొట్టి శీతల ప్రాంతమైన ధర్మశాలలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ముచ్చె మటలు పట్ట్టించింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ జాక్ క్రాలే (79) మినహా మిగిలిన బ్యాటర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలిరోజు ఆట ముగిసేసరికి 135/1 స్కోరుతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 83 పరుగుల వెనకంజలో ఉంది. యశస్వి జైస్వాల్ 57, మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. రోహిత్ శర్మ 52*, శుభ్‌మన్ గిల్ 26 క్రీజులో ఉన్నారు. భారత ఓపెనర్లు బ్యాటింగ్ చేసిన తీరు టీ20 మ్యాచ్‌ని తలపించింది. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్ ఔటైన తర్వాత వచ్చిన గిల్ కూడా నిలకడగా ఆడాడు.