Sports: IPL 2024లో ఇవాళ RCB, లక్నో జట్ల మధ్య కీలక పోటీ..

Sports: In IPL 2024, the key competition between RCB and Lucknow teams.
Sports: In IPL 2024, the key competition between RCB and Lucknow teams.

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 14 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెంట్స్ మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

కానీ బెంగళూరు లో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఆర్సిబికి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆర్ సి బి బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ కాస్త క్లిక్ అయితే… మ్యాచ్ గెలిచేస్తారు. ఇక అటు కేఎల్ రాహుల్, పూరాన్ లాంటి ప్లేయర్లు విధ్వంసం సృష్టిస్తే లక్నో విజయం సాధిస్తుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.